బలగం మొగిలయ్య కన్నుమూత..!!

బలగం చిత్రం ఫేమ్ మొగిలయ్య (67) కన్నుమూసారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య బలగం సినిమాతో ఫేమ్ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటుగా బలగం దర్శకుడు వేణు..పలువురు ప్రముఖులు ఆర్దిక సాయం చేసారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున మరణించారు.

బలగం సినిమా ద్వారా అందరి ప్రశంసలు అందుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీల సమస్యతో మొగిలయ్య బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా సినీ ప్రముఖులు సైతం ఆర్దిక సాయం అందించారు.

Folk artist Mogilaiah of Balagam movie fame passes away on Thursday morning

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమాలోని క్లైమాక్స్ లో భావోద్వేగభరితమైన పాటను ఆలపించి మొగిలయ్య ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు. కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలో తిరిగి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొగిలయ్య మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+