హైదరాబాద్ లో చికెన్ తింటున్నారా..? అయితే మీ బాడీ షెడ్డుకే..!
హైదరాబాద్ లో చికెన్ ప్రియులు చాలా మందే ఉంటారు. వీకెండ్ తో పని లేకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు చికెన్ తినేవాళ్లు నగరంలో అనేకమంది ఉంటారు. అయితే హైదరాబాద్ లో మాంసం దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా దాడులు చేపట్టారు. నగరంలోని మెట్రో స్టోర్లు, మాంసం దుకాణాల్లో బుధవారం తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మొత్తం 11 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అయితే అధికారుల తనిఖీల్లో మాంసంపై ఈగలు వాలడం, చికెన్ కటింగ్ వ్యర్థాలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉండటంతోపాటు బొద్దింకలు, ఇతర కీటకాలు కనిపించడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే మటన్ ను ఎలాంటి సేఫ్టీ కవర్లు లేకుండా బహిరంగంగా వేలాడదీయడం, దుకాణాల్లో కనీస పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడాన్ని గుర్తించారు. దాంతో నిర్వాహకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాంసం విక్రయ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని అధికారులుఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు.
కొన్ని కేంద్రాలను మూసివేయడంతో పాటు మరికొన్నింటికి షోకాజ్, ఇంప్రూవ్ మెంట్ నోటీసులు జారీ చేశారు. మాంసం విక్రయ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు ఇంప్రూవ్ మెంట్ నోటీసులు తీసుకున్నవారిలో మార్పు రాకపోతే మూసివేయాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఒక హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుని తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన నగరవాసులను షాక్ కు గురి చేసింది. బాధితుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఆహార భద్రతా చట్టాల ప్రకారం ఎక్కడైనా.. ఎవరైనా కల్తీ ఆహారాన్ని విక్రయించినట్లు రుజువైతే, రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
