తెలంగాణ వచ్చాక కుట్ర, అందుకే ఇలా చేస్తున్నా: కేసీఆర్, చెన్నారెడ్డికి ప్రశంస
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించాక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమైందని, పార్టీలో చేరికలు వలసలు కావని, పునరేకీకరణ మాత్రమేనన్నారు.
రెండేళ్లలో రాజకీయ సుస్థిరత సాధించామని చెప్పారు. ఈ సందర్భంగా మర్రి చెన్నారెడ్డిని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన నేత చెన్నారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ఆంధ్రా శక్తులు అనేక ప్రయత్నాలు చేశాయని, 1969లోనే తెలంగాణ వచ్చి ఉంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి జూన్ 2 నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకల్లో టీఆర్ఎస్ నేతలు, అధికార యంత్రాంగం పాల్గొంటుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేడుకలకు హాజరవుతున్నారు. పోలీసు కవాతుతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన వారికి అవార్డుల ప్రదానం చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications