షర్మిల, పవన్ కళ్యాణ్ లకు తెలంగాణలో ఏం పని? మాజీ ఐఎఎస్ సూటి ప్రశ్న!!

తెలంగాణా రాష్ట్రంలో కడప జిల్లాకు చెందిన వైఎస్ షర్మిలకు, భీమవరం జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ కు ఏం పని అంటూ రిటైర్డ్ ఐఏస్ ఆకునూరి మురళి ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందంటూ కీలక ప్రకటన చేశారు.

ఆసక్తికరంగా తెలంగాణా రాజకీయాలు

ఆసక్తికరంగా తెలంగాణా రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో 7 నుండి 14 ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి, 25 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ బలం ఎంత ఉంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులు వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

వేరే రాష్ట్రాల వారికి తెలంగాణాలో, కేసీఆర్ కు ఏపీలో ఏం పని?

వేరే రాష్ట్రాల వారికి తెలంగాణాలో, కేసీఆర్ కు ఏపీలో ఏం పని?


ఇదిలా ఉంటే తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల వారికి తెలంగాణ రాష్ట్రంలో ఏం పని అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను, వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. వేరే రాష్ట్రాల వాళ్లకు మాతెలంగాణలో ఏం పని? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక కెసిఆర్ కు ఆంధ్ర లో ఏం పని? అంటూ నిలదీశారు.

బాగా డబ్బు ఉందని రాజకీయ వ్యాపారం చేస్తున్నారు కడప జిల్లాకు చెందిన వైఎస్ షర్మిలకు, భీమవరం జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ కు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించిన ఆయన, బాగా డబ్బు ఉందని వీళ్లు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అస్సలు వీళ్లకు ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన వారు ఏం వ్యాపారాలు చేశారు? వారి వద్ద ఉన్నది అవినీతి డబ్బే కదా! అంటూ వ్యాఖ్యలు చేశారు.


బాగా డబ్బు ఉందని రాజకీయ వ్యాపారం చేస్తున్నారు
కడప జిల్లాకు చెందిన వైఎస్ షర్మిలకు, భీమవరం జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్ కు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించిన ఆయన, బాగా డబ్బు ఉందని వీళ్లు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. అస్సలు వీళ్లకు ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన వారు ఏం వ్యాపారాలు చేశారు? వారి వద్ద ఉన్నది అవినీతి డబ్బే కదా! అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆకునూరి మురళికి పవన్ ఫ్యాన్స్ క్లాస్

ఆకునూరి మురళికి పవన్ ఫ్యాన్స్ క్లాస్

అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదిక పెద్ద చర్చ జరుగుతుంది. వైయస్ షర్మిల మాట అటు నుంచి, పవన్ కళ్యాణ్ విషయంలో ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో పనిచేసి కష్టపడి సంపాదించిన డబ్బు అని, ఆ డబ్బును పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించడానికి, రైతులకు, పేదలకు సహాయం చేయడానికి వినియోగిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

ఆకునూరి మురళికి చురకలు

ఆకునూరి మురళికి చురకలు

ఇక ఇదే సమయంలో ఆకునూరి మురళికి మీరంటే మాకు చాలా గౌరవం ఉంది కానీ పవన్ కళ్యాణ్ అవినీతి చేసి సంపాదించాడు అనడం మీ స్థాయికి సరికాదు అంటూ హితవు పలికారు. మీ ఈ ఒక్క మాటతో మీపైన గౌరవం పోయింది.. అవినీతి పైసలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి దగ్గర పని చేసినప్పుడు మీకు గుర్తుకు లేదా అవినీతిపరుడని, మీరు ఎందుకు అతని దగ్గర పనిచేశారు అంటూ ఆకునూరి మురళిని టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+