సీఎం రేవంత్ స్వగ్రామంలో సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు ఏకగ్రీవం..!
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సంగ్రామం త్వరలోనే జరగనున్న తరుణంలో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా.. నామినేషన్లకు గడువు కూడా ముగిసింది. ఒకవేళ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్ధుల నామినేషన్ తిరస్కరణకు గురైతే.. డిసెంబర్1న సాయంత్రం లోపు అప్పీలు చేసుకోవచ్చు. అందుకు గాను సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారికి అప్పీలు చేసుకోవచ్చు. కాగా డిసెంబర్ 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండగా.. ఆ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా & గుర్తుల విడుదల జరగనుంది.
ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. గెలుపొందిన అభ్యర్ధులు వారి నిర్ణయం ప్రకారం ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతారు. ఈ క్రమంలోనే పలు చోట్ల సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి అవుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ లకు సర్కారు నజరానా కూడా ఇవ్వనుంది. కాగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వగ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నిక విషయం హాట్ టాపిక్ గా మారింది. సీఎం సొంత ఇలాకాలో మాజీ మావోయిస్టు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు ఏకగ్రీవం..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి. ఈ గ్రామంలో మాజీ మావోయిస్టు మల్లేపాకుల వెంకటయ్య(అలియాస్ మోహన్) సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1972లో జన్మించిన వెంకటయ్య.. 1994లో మావోయిస్టు పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ లోని కల్వకుర్తి, గంగన్న, పాన్‌గల్ దళాల్లో 2000 వరకు చురుగ్గా పనిచేశారు. 2001లో వెంకటయ్య కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత 2003లో కల్వకుర్తి పోలీసుస్టేషన్‌లోనే హోంగార్డుగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నారు.
కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఈసారి ఎస్సీకి రిజర్వుడు కావడంతో సీఎం చొరవతో గ్రామస్థులంతా ఒకేమాటగా వెంకటయ్యను ఏకగీవ్రంగా ఎంపిక చేశారు. దాంతో ఆయన ప్రస్తుతం చేస్తున్న హోంగార్డు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి సర్పంచిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామస్థులకు రుణపడి ఉంటానని అన్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో 10 వార్డులు ఉండగా అవి కూడా ఏకగ్రీవం కావడం గమనార్హం. వెంకటయ్య సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి సన్నిహితుడుగా చెబుతున్నారు.

మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా.. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, దాదాపు 37 వేల వార్డులకు సంబంధించి ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications