కార్తీక దీపం ఫేమ్ హిమ ఇంటికి ఈటల రాజేందర్-నెట్టింట ఫోటో వైరల్-నెటిజన్ల ఆరా..

మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ చైల్డ్ ఆర్టిస్ట్ సహృద ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సహృద ఈటలతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 'ఈటల రాజేందర్ గారు మా ఇంటికి వచ్చారు...' అంటూ సహృద ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఆయన ఎందుకు వచ్చారు... ఏమిటి... అన్న వివరాలు వెల్లడించలేదు. దీంతో సహృద ఇంటికి ఈటల ఎందుకు వెళ్లారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికపై ఫోకస్ చేసిన ఈటల రాజేందర్... నియోజకవర్గంలో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఆయన సహృద ఇంటికి ఎందుకు వెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది.

former minister etela rajender visited karthika deepam fame hima house

కాగా,చైల్డ్ ఆర్టిస్ట్ సహృద కార్తీక దీపం సీరియల్‌లో హిమ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సీరియల్‌లోనే కాదు సోషల్ మీడియాలోనూ తనదైన అల్లరితో హిమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన డ్యాన్సులతో నెటిజన్లను ఫిదా చేస్తోంది.

హిమ మాత్రమే కాదు,కార్తీక దీపం సీరియల్‌లో నటించే ఆర్టిస్లులందరికీ ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా వంటలక్క పాత్రలో నటించే ప్రేమి విశ్వనాథ్,డాక్టర్ బాబు పాత్రలో నటించే నిరుపమ్ పరిటాలకు ప్రేక్షకుల్లో యమా క్రేజ్ ఉంది. టీఆర్పీ రేటింగ్ విషయంలో ఈ సీరియల్ మిగతా సీరియళ్లు,షోలకు అందనంత దూరంలో ఉంది. ఒకరకంగా ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ తెరపై సంచలనమే అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది.

ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను కార్తీక దీపం ఫ్యాన్స్ వంటలక్క,డాక్టర్ బాబు,మోనితలతో మీమ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ఎన్నో మీమ్స్ వచ్చినప్పటికీ... ఈ మీమ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. డాక్టర్ బాబు నిరపమ్ సైతం ఈ పోస్టర్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేసి ఫన్నీ కామెంట్స్ చేశాడు. 'ఇలాంటి పోస్టర్‌ని ఎలా చేశార్రా బాబు... ఈ ఘోరానికి నాకు సంబంధం లేదు' అని వ్యాఖ్యానించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+