మంత్రి జగదీష్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం ఎంపికలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకోవడంలో మంత్రి జగదీష్‌రెడ్డి మంత్రి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కలెక్టరేట్ విషయంలో దళితులను మంత్రి మోసం చేశారని ఆయన ఆరోపణలు చేశారు.

తక్కువ ధరకే బినామీలతో మంత్రి జగదీష్‌రెడ్డి భూములను కొనిపించారని ఆయన విమర్శలు చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ కుంభకోణంపై హైకోర్టులో కేసు వేస్తామని ఆయన చెప్పారు. కలెక్టరేట్ స్థలం విషయంలో పథకం ప్రకారంగా అవినీతి జరిగిందన్నారు.

former minister Komatireddy Venkat reddy slams on minster Jagdish Reddy

భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన మంత్రి జగదీష్‌రెడ్డికి ఎన్నికల్లో డిపాజిట్ కూడ దక్కదని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు.

ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా కలెక్టరేట్ నిర్మిస్తామని ఆయన చెప్పారు.ప్రజలు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేయకూడదని మాజీ మంత్రి వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.

ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలను బయటపెడతామనే ఉద్దేశ్యంతో తమ శాసనసభ్యత్వాలను రద్దు చేయించిందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former minister Komatireddy Venkat Reddy made allegations on Telangana minister Jagadish Reddy on Friday at Suryapeta. He spoke to media at Suryapeta.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X