మాజీమంత్రి ఎల్లారెడ్డి కన్నుమూత: కెసిఆర్ సంతాపం
మహబూబ్‌నగర్: మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఎల్కొటి ఎల్లారెడ్డి (82) మంగళవారం రాత్రి 9.20 గంటలకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పదిహేను రోజుల క్రితం నిమ్స్‌లో చేరారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఎల్లారెడ్డి అందరితో పెద్దాయన, తాతా అని పిలిపించుకునే నాయకుడు.
గ్రామాల్లో భిక్షాటన చేసుకునే వారు చనిపోయనా అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తి ఆయన. శుభకార్యం ఉందని పిలిస్తే ఆ ఇంటికి వచ్చి ఆశీర్వాదాలు అందించే ఎల్లారెడ్డి ఇకలేరు. 1-10-1933లో ఎల్లారెడ్డి జన్మించారు. మక్తల్ తాలుకా సమితి అధ్యక్షుడిగా రాజకీయ అరగ్రేటం చేశారు. రాజకీయల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ జనతాదళ్‌లో క్రీయాశీలక నాయకుడిగా ఎదిగారు. అనంతరం 1994లో తొలిసారిగా టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండవసారి 1999లో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మార్కెటింగ్, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా విదేశాలకు వెళ్తే ఎల్లారెడ్డి దాదాపు 45 రోజుల పాటు రాష్ట్ర ఇంఛార్జ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2004 మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2009 నారాయణపేట ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్థిగా ఘన విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టిడిపిని వదిలి టిఆర్ఎస్‌లో చేరి తిరిగి మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి చెందారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications