Nallala Odelu: టీఆర్ఎస్‍లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు..
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ ను విడిచి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తన సతీమణితో కలిసి గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ తో ఓదేలు దంపతులు సమావేశమయ్యారు.
కార్పోరేషన్ ఛైర్మన్ పదవి
కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన గులాబీ పార్టీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.నల్లాల ఓదేలు దంపతులు ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. బాల్క సుమన్ వర్గంతో పడకపోవడం, పార్టీలో తమ ప్రాధాన్యత తగ్గిపోవడంతో అసంతృప్తి చెందిన ఓదేలు దంపతులు కాంగ్రెస్ లో చేరారు.

టికెట్ ఇవ్వలేదు
నల్లాల ఓదేల టీఆర్ఎస్ లో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన 2009, 2010, 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిపొందారు. 2018లో టీఆర్ఎస్ అధిష్టానం ఓదేలును కాదని బాల్కసుమన్ కు టికెట్ ఇచ్చారు. ఓదేలు అప్పటి నుంచి పార్టీకి అంటిముట్టనట్లుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications