Nallala Odelu: చెన్నూరులో అరాచక పాలన.. బాల్క సుమన్‍ను ఓడిస్తా..
చెన్నూరులో అరాచక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రజాకార్ పాలనతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలతో మనస్తాపం చెందినట్లు పేర్కొన్నారు. బాల్క సుమన్ వల్లే బీఆర్ఎస్ పార్టీని వీడియో కాంగ్రెస్ లో చేరినట్లు ఓదెలు తెలిపారు. మంచిర్యాల జి్లలా మందమర్రిలో తన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లలా భాగ్యలక్ష్మితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
గతంలో చెన్నూరు నుంచి సుమన్ కు టికెట్ఇచ్చిన సమయంలో తనకు సముచిత స్థానం ఇస్తామని సీఎం కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఆ తర్వాత తనను మోసం చేసినట్లు వివరించారు. తనభార్యకు జడ్పీ చైర్ పర్సన్ పదవి ఇచ్చినా నిరుపయోగమని చెప్పారు. బాల్క సుమన్ తన భార్యను ఎప్పుడూ అవమానించే వారని ఆరోపించారు. సుమన్ ఆగడాలు భరించలేక ఏడాది క్రతమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరినట్లు గుర్తు చేశారు. అయితే బాల్క సుమన్ ఓడిపోయే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారని ఓదెలు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే ఇస్తామని కేటీఆర్ చెప్పారని.. అందుకే బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ చేరి పెద్ద తప్పు చేసినట్లు ఓదెలు విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు క్షమాపణ కూడా చెప్పారు. కేసీఆర్ మళ్లీ సిట్టింగులకు టికెట్ఇవ్వడంతో పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సుమన్ రెండు సార్లు తన ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని, పార్టీలో కొనసాగాలని కోరినట్లు తెలిపారు. మూడోసారి వచ్చి ఎలాంటి పదవి ఇచ్చేది లేదని బెదిరించినట్లు వాపోయాడు.
కాంగ్రెస్అధిష్టానం తనకు అవకాశం ఇస్తే బాల్క సుమన్ ను ఓడిస్తానని చెప్పారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఓదెలు స్పష్ట చేశారు. జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటామని ప్రమాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుమన్ చెప్పే అభివృద్ధి అంతా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైనవేని ఓదెలు గుర్తు చేశారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని, సుమన్ సిద్ధమా అని ఓదెలు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications