కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తప్పదా?: బీజేపీలోకి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, అశ్వద్ధామ రెడ్డి, మరో టీఆర్ఎస్ నేత
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు పార్టీల్లోని కీలక నేతలు బీజేపీ బాట పట్టగా.. తాజాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా జూన్ 14న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.ఇప్పుడు మరికొంత మంది నేతలు కూడా బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.
శుక్రవాం రాష్ట్ర పార్టీ నేతలతో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన విషయం తెలిసింద. అయితే, అదే సమయంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డుకు చెందిన టీఆర్ఎస్ నేత కేశ రెడ్డి కూడా ఈటల నివాసంలోనే ఉండటం గమనార్హం. దీంతో వారు కూడా ఈటలతోపాటు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లే. ఇప్పటికే డీకే అరుణ, విజయశాంతి లాంటి కీలక నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన అనుచరులతో రమేష్ రాథోడ్ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తోపాటు రమేష్ రాథోడ్, ఆర్టీసీ టీఎంయూ నేత అశ్వద్ధామ రెడ్డి, టీఆర్ఎస్ నేత కేశవరెడ్డిలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈటల నివాసంలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్‌తో రమేష్ రాథోడ్ తోపాటు ఈ నేతలు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications