రాత్రి కిడ్నాపైన మాజీ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి దారుణ హత్య: వారిపైనే అనుమానాలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన మాజీ రిపోర్టర్ కరుణాకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ రెడ్డి(29) ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసేవాడు. కొద్ది నెలల క్రితమే మానేశాడు.
ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం(ఏప్రిల్ 16) రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డిపై దాడి చేసి కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

తీవ్రగాయాలపాలైన శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా.. మృతుడిని కిడ్నాపైన కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరుణాకర్ రెడ్డి మృతి విషయం తెలియగానే ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కాగా, కొత్తూరు మండల స్థాయి ప్రజాప్రతినిధితో విభేదాలే కరుణాకర్ రెడ్డి మరణానికి దారితీశాయా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిది ఒకే ఊరు. సదరు ప్రజాప్రతినిధి వద్ద ప్రధాన అనుచరుడిగా ఉన్న కరుణాకర్ రెడ్డి.. విభేదాల కారణంగా అతడికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు జరిగి కేసులు కూడా నమోదయ్యాయి. సదరు ప్రజాప్రతినిధి అనుచరులు, సొంత తమ్ముళ్లే.. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా, కిడ్నాప్ జరిగినప్పటి నుంచి ప్రజాప్రతినిధి, అతడి అనుచరుల ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు సమాచారం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications