ఇందిర, రాజీవ్‌లకు అత్యంత సన్నిహితుడైన మాజీ కేంద్రమంత్రి మృతి
కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 52లోని స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు.
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 52లోని స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు.
శివశంకర్.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కేబినెట్లో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆయన 1929 ఆగస్టు 10న జన్మించారు. తొలి నుంచి 2008 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత 2008-11 మధ్యలో ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు.

అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, న్యాయశాఖ, పెట్రోలియం శాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహించారు. ఇందిర, రాజీవ్‌లకు శివశంకర్ అత్యంత సన్నిహితుడిగా చలామణి అయ్యారు. ఆయన సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
శివశంకర్ మృతికి తెలుగు రాష్ట్రాల నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత వైయస్ జగన్, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు సంతాపం తెలిపారు.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications