కేసీఆర్‌తో ఫెడరల్ ఫ్రంట్ చర్చలు: హైదరాబాద్ వచ్చిన అఖిలేష్
Recommended Video

అఖిలేశ్-కేటీఆర్ సరదా సంభాషణ
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఫెడరల్ ఫ్రంట్ అంశంపై చర్చలు జరిపేందుకు ఆయన వచ్చారు.
తెలంగాణ సీఎం ఫెడరల్ ప్రంట్ కోసం ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించారు. ఆ తర్వాత వరుసగా జాతీయస్థాయిలో కీలకంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నారు.

ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం బెంగళూరు వెళ్లి జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామిలను కలిశారు. ఇటీవల చెన్నైలో కరుణానిధి, స్టాలిన్, కనిమొళిలతో చర్చలు జరిపారు.

ఇప్పుడు అఖిలేష్ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications