వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి, పయ్యావుల: ఒకే రోజు కెసిఆర్‌తో భేటీ, ఏం జరుగుతోంది?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును బుదవారం నాడు కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ శుభలేఖను అందించారు.పయ్యావుల కేశవ్ కూడ తమ ఇంట్లో జరిగే వివాహనికి హజరుకావాలంటూ కెసిఆర్‌కు శుభలేఖను ఇచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఇద్దరు నేతలు ఓకే రోజు కెసిఆర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Recommended Video

Lagadapati Rajagopal latest survey facts on TDPలగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు | Oneindia Telugu

చదవండి: పయ్యావుల తనను ఎందుకు కలిశారో చెప్పిన కేసీఆర్!: రేవంత్ ఎఫెక్టా?

తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో టిఆర్ఎస్‌పై, కెసిఆర్‌పై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకుండా చివరివరకు రాజగోపాల్ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రోజున పెప్పర్ స్ప్రే కొట్టి సంచలనం సృష్టించారు.ఈ ఘటన ఆ రోజుల్లో తీవ్ర సంచలనం కల్గించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకుండా శక్తివంచన లేకుండా రాజగోపాల్ ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాలేకపోయారు.

కెసిఆర్‌తో లగడపాటి భేటీ

కెసిఆర్‌తో లగడపాటి భేటీ

తెలంగాణ సీఎం కెసిఆర్‌తో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుదవారం నాడు సమావేశమయ్యారు. తన కుమారుడి వివాహనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు కెసిఆర్‌తో లగడపాటి రాజగోపాల్ సమావేశమయ్యారు. లగడపాటి రాజగోపాల్‌ను కెసిఆర్ సాదరంగా ఆహ్వనించారు.లగడపాటిని కుశలప్రశ్నలు వేశారు.

నాడు లగడపాటి ఆమరణ దీక్ష

నాడు లగడపాటి ఆమరణ దీక్ష


తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయవాడ మాజీ ఎంపీ ఆనాడు విజయవాడలో ఆమరణదీక్ష చేపట్టారు. ఆ దీక్ష సమయంలో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నష్టమని రాజగోపాల్ వాదించేవారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా చివరివరకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్రం విడిపోతే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.ఈ మాట మేరకే లగడపాటి రాజగోపాల్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

 తెలంగాణ బిల్లు సమయంలో పెప్పర్ స్పే

తెలంగాణ బిల్లు సమయంలో పెప్పర్ స్పే

తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో అప్పటి యూపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజున ఈ బిల్లు పాస్ కాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఆనాటి ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు.ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే కొట్టాడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు చెందిన ఎంపీలు ఆంద్రప్రాంతానికి చెందిన ఎంపీలతో వాగ్వాదానికి దిగారు.

ఆ ఇద్దరు ఒకే రోజు కెసిఆర్‌తో భేటీ..

ఆ ఇద్దరు ఒకే రోజు కెసిఆర్‌తో భేటీ..

తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆంధ్రప్రాంతానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే రోజున తెలంగాణ సీఎం కెసిఆర్ తో సమావేశమయ్యారు. టిడిపికి చెందిన పయ్యావుల కేశవ్, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన లగడపాటి రాజగోపాల్ కూడ బుదవారం నాడు సీఎం కెసిఆర్‌ను కలిసి తమ ఇండ్లలో జరిగే వివాహకార్యక్రమాలకు హజరుకావాలని కోరారు.అయితే యాధృచ్చికంగా ఇద్దరు వేర్వేరు సమయాల్లో తెలంగాణ సీఎం కెసిఆర్‌తో సమావేశమయ్యారు.
వీరిద్దరి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. కెసిఆర్‌కు పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు నేతలు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నారనే పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఈ ఇద్దరు నేతలకు కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారనే ప్రచారం కూడ లేకపోలేదు.

English summary
Former Vijayawada MP Lagadapati Rajagopal met Telangana Chief Minister KCR for inviting her son's wedding . Lagadapati Rajagopla met KCR on wednesday evening at Hydrabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X