హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కలను సాకారం చేశారు: కేటీఆర్‌కు ఆనంద్ మహీంద్ర థ్యాంక్స్: వెయిట్ చేయలేకపోతున్నాం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఐఏ ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రతినిధులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఇది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తారు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి.

కొన్ని దేశాలకే పరిమితం..

కొన్ని దేశాలకే పరిమితం..

ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరింది. అంతర్జాతీయ ఖ్యాతిని సాధించినట్టయింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది. దీనికోసం బేగంపేట్‌ ఐటీసీ కాకతీయలో ఎఫ్ఐఏ ఫార్ములా నిర్వాహకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

కేటీఆర్ సమక్షంలో..

కేటీఆర్ సమక్షంలో..

ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఎఫ్ఐఏ ఫార్ములా ఈ చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బెర్టో లొంగో, రేసింగ్ ట్రాక్ అండ్ ఓవర్‌లాగ్ డైరెక్టర్ ఆగస్ జొమెనో, గ్రీన్‌కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫసీర్ అనిల్ చలమలశెట్టి, మహీంద్రా రేసింగ్ సీఈఓ అండ్ టీమ్ ప్రిన్సిపల్ దిల్‌బాగ్ గిల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించబోతున్నామంటూ వారు ప్రకటించారు.

ఆనంద్ మహీంద్ర ఆనందం..

ఆనంద్ మహీంద్ర ఆనందం..


ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతోండటాన్ని ఆటోమొబైల్ సెగ్మెంట్‌‌కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర స్వాగతించారు. స్వదేశంలో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ తాము ఎదుచు చూస్తోన్నానని చెప్పారు. సొంత గడ్డ మీద ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ఫార్ములా-ఈని నిర్వహించాలనేది తన కల అని, అది సాకారమైందని అన్నారు.

కల సాకారం చేశారంటూ..

తన కలను సాకారం చేసినందుకు ఆనంద్ మహీంద్ర.. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో అతి పెద్ద ముందడుగు వేశారని ప్రశంసించారు. తాను ఆగలేకపోతున్నాంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఫార్ములా-ఈ టీమ్స్‌ను తాము ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. మహీంద్ర రేసింగ్ పేరుతో ప్రత్యేక విభాగమే ఉందని గుర్తు చేశారు. మహీంద్ర రేసింగ్ పేరుతో తాము ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటామని పేర్కొన్నారు.

 తొలి రేసు ఎప్పుడంటే..?

తొలి రేసు ఎప్పుడంటే..?

ఫార్ములా-ఈ ఎలక్ట్రిక్ కార్ల మధ్య తొలి రేసు ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి మార్చి 2023 మధ్యన నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల సర్క్యుట్ ఓవర్‌లుకింగ్‌పై ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్‌ను నిర్మించే ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. తొలిదశలో హుస్సేన్ సాగర్ వద్ద ఈ రేస్‌ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం దీన్ని నగర శివార్లకు తరలించే అవకాశాలు లేకపోలేదు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ట్రాక్‌ను నిర్మించే యోచనలో ఉంది కేసీఆర్ సర్కార్.

English summary
Mahindra and Mahindra group chairman Anand Mahindra says thanks to Telangana Minister KTR for taking initiations from the government to conduct Formula E world championship in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X