కేసీఆర్ చురకలు, ఇన్ఫోసిస్ అధినేత కితాబు!
హైదరాబాద్: రాజేంద్ర నగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ క్యాంపస్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రులు, అధికారులను ఈగో ఫీలింగ్స్ పట్టి పీడిస్తున్నాయన్నారు.
నాయకులు, పోలీసు అధికారులపై సెటైర్లు విసిరారు. ఎవరికి వారు తమతమ వాదనలను వినిపిస్తారని విమర్శించారు. పోలీసులు లేనిదే హైదరాబాద్ లేదన్నట్లుగా వారు వ్యవహరిస్తారన్నారు. హైదరాబాద్ ఒక సంఘంగా బతుకుతోందని, పోలీస్ వ్యవస్థ సమాజంలో తప్పులు దొర్లితే సరిచేసే ఒక మెకానిజం మాత్రమేనన్నారు.

ఇక నాయకులంతా ఆదేశాలిచ్చే వారిలా, ఇతరులంతా వాటిని పాటించే వారిలా వ్యవహరిస్తారన్నారు. ఈ తీరు మారలని, మారుతుందనే ఆశ తనకుందన్నారు.
సంస్థను ప్రారంభించిన అంశంపై మాట్లాడుతూ.. ఈ సంస్థను ప్రారంభించినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఈ సంస్థకు సహకారం అందిస్తామన్నారు. హెల్త్ క్యాంపస్ కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తామన్నారు. కాగా, ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ చైర్మన్ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. మంచి ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చారని కితాబిచ్చారని సమాచారం.












Click it and Unblock the Notifications