వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైళ్ళద్వారా గంజాయి దందా.. ఇద్దరు మహిళలతో సహా నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వాలు ఎంత నిఘా పెట్టినా గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుందా? ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ నిత్యకృత్యంగా మారిందా? రోడ్డు రవాణా మార్గాలు, రైలు మార్గాలు ఇలా ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని గంజాయి స్మగ్లర్లు దందా సాగిస్తున్నా రా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు; డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంరాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్సులు రద్దు; డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం

 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నవారిని వరంగల్ కమీషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రైన్ ద్వారా కావాల్సిన వారికి గంజాయిని సప్లై చేస్తున్న ఇద్దరు మహిళలతో సహా నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు సంఘటల్లో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలతో సహ నలుగురు నిందితులను మీల్స్ కాలనీ మరియు మట్వాడా పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు సుమారు ఆరు లక్షల 30వేల రూపాయల విలువగల 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశాకు చెందిన ముగ్గురిని, బీహార్ కు చెందిన ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒడిశాకు చెందిన ముగ్గురిని, బీహార్ కు చెందిన ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు


పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన తబ్బతీయా భీశోయీ, కామిని నాయక్, దమ్ముని నాయక్, బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ లు వున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నలుగురు గంజాయి స్మగ్లర్లు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఒడిశా ప్రాంతంలో తక్కువ ధర గంజాయిని కోనుగోలు చేసి కిలో చొప్పున ప్యాకింగ్ చేసి సాధారణ ప్రయాణికుల వలే గంజాయి ప్యాకెట్లను భద్రపర్చిన బ్యాగులతో రైళ్ళ ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తం డబ్బు సంపాదించేవారని పేర్కొన్నారు.

ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు

ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు


ఇందులో భాగంగా నిందితులు సోమవారం నాడు ఒడిషా బరంపూర్ నుండి బయలు దేరి మంగళవారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న నిందితుల్లో ఇద్దరైన భీశోయీ, కామిని నాయకు రైల్వే స్టేషన్ నుండి శివనగర్ వైపు వెళ్ళుతుండగా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిందితులు అనుమానస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారి వద్ద వున్న బ్యాగులను తనిఖీ చేశారని, అందులో గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితులను విచారించారు.దీంతో వారు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా అంగీకరించడంతో నిందితులను అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 మరో ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన మట్వాడ పోలీసులు

మరో ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన మట్వాడ పోలీసులు

అదే విధంగా మరో ఇద్దరు నిందితులు రాజేష్ కుమార్, దమ్ముని నాయకు వరంగల్ యం.జి.యం సెంటర్ లోని శంకర్ విలాస్ హోటల్ ప్రాంతంలో అనుమానస్పదంగా సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వెళ్ళి నిందితుల బ్యాగులను తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో గంజాయి గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారిని విచారణ నిమిత్తం మట్వాడా పోలీస్ స్టేషన్ తరలించారని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

English summary
Warangal Commissionerate police have arrested four ganja smugglers, including two women, for smuggling ganja through trains, CP Tarun Joshi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X