విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఉరేసుకున్నారు
హైదరాబాద్: ఆర్థిక సమస్యలను తట్టుకోలేక దంపతులు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాము ఉరి వేసుకొని మరణించిన సంఘటన మంగళవారం ఉదయం హైదరాబాదులోని జీడిమెట్ల పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
నల్ల కేశవరావు, వనజ దంపతులు దాదాపు పన్నెండేళ్ల క్రితం ఈ ప్రాంతానికి వలస వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ భారీగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప మార్గం లేదని భావించారు. పిల్లలు దీపక్, నందినిలకు విషం తాగించి, ఆ దంపతులు ఉరి వేసుకొన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య చేసుకున్న దంపతులు కోల్‌కతా నుంచి వచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల బంధువులను పోలీసులు సంప్రదిస్తున్నారు.
తమ మృతికి సుబ్బారెడ్డి అనే వ్యక్తి కారణమని, ఆయన వల్ల తాము వ్యాపారంలో నష్టపోయామని సూసైడ్ నోట్‌లో రాశారు. వారితో పాటు కేశవరావు తల్లి చంద్రమ్మ కూడా ఉంటోంది. అయితే ఆమెకు కళ్లు కనిపించవని, రాత్రి ఏం జరిగిందో తెలియదని చెబుతోంది.












Click it and Unblock the Notifications