మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురుగుల మందు తాగి నలుగురు ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టిన సంఘటన నాలుగు రోజుల అనంతరం మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పొదల మద్య వెలుగు చూసింది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. కొండాపూర్ ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్ కథనం ప్రకారం వివారాలు ఈ విధంగా ఉన్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లా కానగల్ మండలం కమాలోద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన రాజు (42) రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో అడ్డా కూలీగా పని చేస్తూ నివాసం ఉంటున్నాడు. తాండూర్‌కు చెందిన అనిత (33) భర్త మృతి చెందడంతో తన ఇద్దరు కూతుళ్లతో చందానగర్‌లోనే అడ్డాకూలిగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది.

Four members of a family commit suicide

ఈ క్రమంలో రాజుతో పరిచయం ఏర్పడటంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. మృతుల వద్ద లభించిన సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు విచారణ చేయగా మృతుల వివరాలు తెలిశాయి. వెంట తెచ్చుకున్న మోనోక్రొటోపాస్‌ను రాజు నాకౌట్ బీర్‌లో కలుపుకుని తాగగా, అనిత ఆర్‌సి బీర్ మినిసైజ్‌లో కలుపుకుని, ఉమ (15), అఖిల (12)లకు మాజా పానియంలో కలిపి తాగారు.

మృతదేహాల వద్ద మోనోక్రొటోపాస్ పురుగుల మందు డబ్బాతో పాటు బీరు బాటిళ్లు, మాజా బాటిల్‌ను పోలీసులు కనుగొన్నారు. నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడటంతో శవాలు కుళ్లిపోయి దుర్వాసన వెలువడుతోంది. విషం తాగిన అనంతరం బాధ తట్టుకోలేక ఒకరిపై ఒకరు పొర్లినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. మృతదేహాలన్ని ఒకే చోట కుప్పగా పడివున్నాయి.

సంఘటన స్థలానికి అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న, సదాశివపేట, సంగారెడ్డి రూరల్ సిఐలు శ్రీనివాస్ నాయుడు, శ్యామల వెంకటేశం, సంగారెడ్డి రూరల్, ఇంద్రకరణ్, కొండాపూర్ ఎస్‌ఐలు రాజశేఖర్, ప్రవీన్‌రెడ్డి, ప్రవీన్‌కుమార్‌లు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆర్‌ఐ మల్లికార్జున్ శవపంచనామ నిర్వహించిన అనంతరం శవాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మల్కాపూర్ విఆర్‌ఓ విఠల్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

English summary
Four persons committed suicide in Medak district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X