ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు యువకులు మృతి

శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు.

హైదరాబాద్: శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. ఆదివారం రాత్రి శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 అతివేగంతో అదుపు తప్పిన వాహనం

అతివేగంతో అదుపు తప్పిన వాహనం

సికింద్రాబాద్‌ ప్రాంతంలోని క్లాక్‌టవర్‌, నల్లగుట్ట, గోపాల్‌పురం ప్రాంతాలకు చెందిన విఘ్నేశ్‌(20), హర్మిందర్‌ సింగ్‌(21), మారియోకాబ్రా(21), రాహుల్‌(20)లు మహేంద్ర ఎక్స్‌యువీ-500 (ఎపీ 29 ఎడబ్లు్య 0939)లో కండ్లకోయ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డులో శామీర్‌పేటకు వస్తున్నారు. వేగంగా వెళుతున్న వారి కారు శామీర్‌పేట జంక్షన్‌ సమీపంలోకి రాగానే చిన్న మలుపు వద్ద అదుపు తప్పింది.

బెలూన్లు తెరుచుకున్నా..

బెలూన్లు తెరుచుకున్నా..

వర్షపు నీటి కాలువలోకి దూసుకొచ్చి అదే వేగంతో పైకి లేచిన వాహనం గాలిలో పల్టీలు కొడుతూ చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది. వర్షపు నీటి కాలువ నిర్మాణానికి వాహనం ఢీకొన్న సమయంలో బెలూన్లు తెరచుకున్నాయి. అయినప్పటికీ వాహనంలో ఉన్న నలుగురు మిత్రులను అవి రక్షించలేకపోయాయి. నలుగురి తలలకూ తీవ్రమైన దెబ్బలు తగిలాయి. వాహనంలోనే ప్రాణాలు కోల్పోయారు.

కారువేగం గంటకు 120కి.మీ..

కారువేగం గంటకు 120కి.మీ..

ప్రమాదానికి గురైన సమయంలో కారు వేగం 120 కి.మీ. ఉన్నట్లు పోలీసులు అంచనావేస్తున్నారు. విఘ్నేశ్‌ జైపూర్‌లోని మణిపాల్‌ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. అతడే వాహనాన్ని నడుపుతున్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ, సాకేత్‌ పాంతాలకు చెందిన మిత్రులు అర్వీందర్‌ సింగ్‌ నాగ్‌పాల్‌, అనిష్‌, నిమిష్‌, రవి, సైనీలు అంతకు ముందే మరో కారులో శామీర్‌పేటలోని డ్రైవ్‌ ఇన్‌ దాబాకు చేరుకుని భోజనాలు చేస్తున్నారు. వీరి ఆహ్వానం మేరకు విఘ్నేశ్‌, అతని ముగ్గురు మిత్రులు శామీర్‌పేట వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

స్నేహితుల రోదనలు

స్నేహితుల రోదనలు

తవస్తున్నామని చెప్పిన మిత్రులు ఎంతకీ రాకవపోటం, ఫోన్‌ చేసినా స్పందించకపోవటంతో అర్వీందర్‌ సింగ్‌ తదితరులు ఔటర్ రింగ్ రోడ్డు వైపునకు బయలుదేరారు. తమ మిత్రులు నలుగురు మృత్యువాత పడ్డారని తెలుసుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. శామీర్‌పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి గాంధీ మార్చురీకి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+