నగరంలో ఉచిత అన్నపూర్ణ భోజనాలు.!బృహత్కర కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం.!
హైదరాబాద్: కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో దాని కట్టడికోసం ప్రభుత్వం లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. దీంతో చాలా మంది రోజూవారీ కూలీలు వారి ఉపాదిని కోల్పోయారు. తినడానికి తిండిలేక అనేక ఇబ్బందులు పడుతున్న సందర్బాలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి వారి కోసం ఓ బృహత్కర కార్యక్రమానికి నగర మున్సిపాలిటీ సంస్థ రూపకల్పన చేసింది. లాక్‌డౌన్ పూర్తయ్యేంత వరకూ ఎవ్వరూ కూడా ఆకలితో అలమటించకూడదని నిర్తారించుకుంన్నట్టు తెలుస్తోంది. అలాంటి వారి కోసం ఉచితంగా భోజనం పంపిణి చేసేందుకు ప్రణాళిక రచించింది జీహెచ్ఎంసీ. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో నగరంలోని నిరాశ్రయులు, నిరు పేదల సౌకర్యం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతీ రోజూ ఉచిత బోజనాలను అందిస్తోంది. నగరంలోని అన్నపూర్ణ కేంద్రాల ద్వారా అందిస్తోన్న ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా అందచేయడంతోపాటు మరో వంద కేంద్రాలను అదనంగా ఏర్పాటుచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు.

దీనితో, ప్రస్తుతం నగర పరిధిలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తోన్న 150 అన్నపూర్ణ కేంద్రాలకు తోడు మరో 100 అదనపు అన్నపూర్ణ కేంద్రాలను తెరిచారు. వీటితో పాటు సర్కిల్ కు ఒక్కటి చొప్పున ఒక ప్రత్యేక కేంద్రం ఓపెన్ చేసి బాక్స్ లలో ఉంచిన భోజనాన్ని ఆయా సర్కిళ్ల వీధుల్లో తలదాచుకునే వారికి సంబంధిత ఏ.ఎం.హెచ్.ఓ ఆధ్వర్యంలో అందచేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళలో ఈ బోజనాలను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రోజుకు కనీసం 45 వేల అన్నపూర్ణ బోజనాలను ఉచితంగా అందచేయాలని ఆదేశించినప్పటికీ, అంతకు మించి భోజనాలను పంపిణీచేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ప్రతీ భోజనంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబార్, పచ్చడి తప్పని సరిగా ఉండే విధంగా మెనూను అమలు చేస్తున్నారు. సమతుల పోషక పదార్థాలతో అందిస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనాన్ని అందించడం పట్ల వలస కార్మికులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, వివిధ ఆసుపత్రుల వద్ద పేషంట్ల తాలూకా బందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications