గణేష్ నవరాత్రుల వేళ వాళ్లకు కరెంట్ ఫ్రీ!
ఈ ఏడాది గణేశ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అవసరమైన ఏర్పాట్లను అన్నీ విభాగాలు సమన్వయంతో చేయాలని నగర ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించే మండపాలకు ఉచిత విద్యుత్ అందించ బోతున్నట్టు ఆయన పేర్కొన్నారు . హైదరాబాద్ లోని Dr MCRHRD సంస్థలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గణేశ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలలో పాల్గొనే ప్రజలకు అవసరమైన త్రాగు నీరు లాంటి సదుపాయాలను కల్పించాలనీ, పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలనీ ఆదేశించారు. గణేష్ నవరాత్రులు నిర్వహించే మండపాల వద్ద నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

గణేష్ ఉత్సవాలను నిర్వహించనున్న ప్రభుత్వం
అలాగే ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుందని రాజధానిలో జరుగుతున్న అతిపెద్ద వేడుక గణేష్ ఉత్సవాలని ఆయన అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఆర్ అండ్ బి, జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీస్, హెల్త్, విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని పనిచేసి గణేష్ ఉత్సవాలను సక్సెస్ చేయాలని ఆయన పేర్కొన్నారు.
మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు
ఇప్పటికే అన్ని శాఖలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారు అని, ఇప్పుడు ఈ సమన్వయ సమావేశం ద్వారా అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, విగ్రహాలను తరలించే వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నాహాలు
ఈ సమన్వయ సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపి డా జితేందర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక వినాయక చతుర్ధి త్వరలో రానున్న క్రమంలో ఇప్పటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వాడవాడలా గణేశ మండపాల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications