టికెట్ అక్కర్లేదు.. అందరికీ ఫ్రీ జర్నీ!

సిటీలో ప్రయాణమంటేనే ట్రాఫిక్ జాంలు, గంటల తరబడి నిరీక్షణ.. వీటన్నింటికీ ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సర్కార్, ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఈ సరికొత్త పథకాన్ని పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదికి సుమారు రూ. 10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత ప్రయాణ పథకం వల్ల రైల్వే నష్టపోకుండా ఉండేందుకు, ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు దక్షిణ మధ్య రైల్వే కూడా సానుకూలంగా స్పందించింది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ఒప్పందం (MoU) కుదిరే అవకాశం ఉంది.

Free MMTS Travel for All Telangana Govt to Make Hyderabad Commute Free for Everyone from June 2 2026

ఆదరణ పెంచడమే లక్ష్యం..

ఒకప్పుడు నిత్యం లక్షకు పైగా ప్రయాణికులతో కళకళలాడిన ఎంఎంటీఎస్, ప్రస్తుతం సరైన సమయపాలన లేక వెలవెలబోతోంది. ప్రస్తుతం కేవలం 40 వేల మంది లోపే ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో, ఉచిత ప్రయాణంతో పాటు మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం సూచించింది:

  • ట్రిప్పుల పెంపు: రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచాలి.
  • సమయపాలన: రైళ్లు నిర్ణీత సమయానికి నడిచేలా చర్యలు తీసుకోవాలి.
  • కనెక్టివిటీ: రైల్వే స్టేషన్ల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్టేషన్ ప్రాంగణాల్లో బస్సులకు స్థలం కేటాయించాలని రైల్వేను కోరింది.

కీలక మలుపులో MMTS-2..

ఉచిత ప్రయాణ ప్రతిపాదన బాగున్నప్పటికీ, ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 491.45 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని రైల్వే శాఖ గుర్తు చేసింది. ఈ బకాయిల చెల్లింపుతో పాటు ఉచిత ప్రయాణ పథకం అమలుపై స్పష్టత వస్తే, భాగ్యనగర ప్రజారవాణాలో ఇదొక చారిత్రాత్మక మార్పు కానుంది. ముందుగా ఏడాది పాటు ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, వచ్చే స్పందనను బట్టి శాశ్వతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+