ఉచిత స్కూటీ పథకం .. మీ సేవా కేంద్రాల వద్ద మహిళల క్యూ .. ఫేక్ న్యూస్ అంటున్న అధికారులు
ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తాం.. పది రూపాయల చీర దొరుకుతుంది అంటే పది కిలోమీటర్ల మేర క్యూలో నిల్చుంటాం.. ఇక ఏకంగా ఉచితంగా స్కూటీ దొరుకుతుంది అంటే ఇక మన వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు.. అందుకోసం తెగ హడావిడి చేసేసున్నారు . కష్టపడి సంపాదించుకున్న దానిలో పొందే ఆనందం కంటే ఫ్రీగా వచ్చిన దాంట్లో బోలెడంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు .. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రీ స్కూటీ పథకం పేరుతో ఫేక్ న్యూస్ .. మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్న మహిళలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త పథకాన్ని ప్రారంభించారని మహిళలకు ఉచితంగా స్కూటీలు ఇస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఈ స్కూటీలు పొందాలనుకునేవారు మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం జరగడంతో లక్షలాది మంది మహిళలు మీ సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. పదో తరగతి పాస్ అయి 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకాన్ని పొందడానికి అర్హులు అని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్త పత్రికలలో సైతం ప్రచురితమైంది. ఇక దీంతో ఉచిత స్కూటీ పథకాన్ని పొందడం కోసం మీ సేవ కేంద్రాల వద్దకు మహిళలు పరుగులు పెడుతున్నారు.

ఉచిత స్కూటీ పథకం ఫేక్ అని తేల్చిన ఫ్యాక్ట్ లీ సంస్థ .. అలాంటి స్కీం లేదన్న సర్కార్
అయితే ఈ ప్రకటన వైరల్ కావడం, మరియు మీ సేవ కేంద్రాల వద్ద పరిస్థితులు తెలియడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలాంటిది ఏమీ లేదంటూ ప్రకటన చేసింది. కేంద్రం ఎటువంటి పధకం ప్రకటించలేదని , ఉచిత స్కూటీ పథకం ఫేక్ అని , ఇక ఈ వార్తలు అవాస్తవమని , ఎవరు స్కూటీల కోసం మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ స్పష్టంగా చెప్పింది. సామాజిక మాధ్యమాలలో తప్పుడు వార్తలు గుర్తించే సంస్థ అయిన ' ఫ్యాక్ట్ లీ ' సైతం ఇదే విషయాన్ని ప్రకటించింది. అయితే ఇదంతా కొందరు ఆకతాయిలు సృష్టించిన ప్రచారం అని తెలియడంతో ఈ విషయంలో మహిళలు అప్రమత్తం చేయడానికి, ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని చెప్పడానికే అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది.

అధికారిక వెబ్ సైట్స్ లోనూ కనిపించని స్కీం .... ఫేక్ వార్తలు నమ్మొద్దని అధికారుల సూచన
మోడీ దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాన్ని ప్రారంభించి ఉంటే, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తాపత్రికలలో కనిపించేది . ఈ పథకం గురించి వివరాలను శోధించటానికి చేయడానికి ప్రభుత్వ వెబ్‌సైట్లలో చూసినా అటువంటి పథకం ఏ వెబ్ సైట్ లోనూ లేదు . సాధారణంగా, కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు, దాని గురించి సమాచారం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' ద్వారా విడుదల అవుతుంది. కానీ అలాంటిదేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ‘స్కూటీ యోజన' పథకం అందించటం లేదు అన్నది వాస్తవం . తమిళనాడులో ‘అమ్మ స్కూటర్ పథకం' ఉంది కాని లబ్ధిదారులు ఆ రాష్ట్రానికే పరిమితం. జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి పథకం ఉంది కాని లబ్ధిదారులు ఆ రాష్ట్ర పరిధిలోనే ఉన్నారు. ఇక మిగతా రాష్ట్రాలలో కానీ, కేంద్రం ద్వారా గానీ ఎలాంటీ ఫ్రీ స్కూటీ పథకాలు లేవని తెలుస్తుంది. ఇక ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని చెప్తున్నారు అధికారులు .
-
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications