ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!
హయత్‌నగర్/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీల దాకా మందు తాగిన పక్కింటి వ్యక్తి ఇంట్లోకి దూరి అసభ్యంగా ప్రవర్తించడంతో మనస్తాపం చెందిన గృహిణి నిండు ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన హయత్‌నగర్‌లోని పవనగిరి కాలనీలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరుకు చెందిన కొమిరెడ్డి రమేశ్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇరవై నాలుగేళ్ల తన భార్య ప్రశాంతి, ఇద్దరు పిల్లలతో కలిి ఐదేళ్లుగా హయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పై అంతస్తు అద్దెకు ఉంటున్నాడు. వీరు ఉంటున్న అంతస్తులోనే గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఇరవై ఏడేళ్ల కుంచాల నరేశ్ అనే తాపీ మేస్త్రీ కుటుంబంతో జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి 9 గంటలకు ఫుల్లుగా తాగొచ్చిన నరేశ్.. తన ఇంట్లోకి బదులు ప్రశాంతి ఇంట్లోకి వెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కింది అంతస్తులో ఉంటున్న ఇంటి యజమానికి ఫిర్యాదు చేసింది.
అప్పటికే తీవ్ర మనస్తాపం చెందిన ప్రశాంతి, ఇంట్లోకి ెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఆ సమయంలో పాప నిద్రిస్తుండగా, బాబును బయటకు పంపించి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు తలుపులు పగులకొట్టి, మంటలు ఆర్పారు. తీవ్రగాయాలైన ప్రశాంతిని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రాణాలు విడిింది.తాగిన మత్తులో ఓ ఎదవ చేసిన సన్నాసి పనికి ఓ నిండుప్రాణం బలవ్వడం అక్కడి వారిని కలచివేసింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications