సికింద్రాబాద్‌లో మరో రైల్వే స్టేషన్: అన్ని ప్రాంతాలకూ రైళ్లు
Begumpet Railway Station: హైదరాబాద్ బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు ఇక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అమృత్ భారత్ కింద తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్.. వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. మొదటి విడతలో ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే సికింద్రాబాద్, యాదాద్రి, బేగంపేట్ వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. 718 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ అభివృద్ధి పనులను చేపట్టారు. మూడు దశల్లో ఇవి పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మితం కానుంది.
అదే క్రమంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులూ చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. స్టేషన్ ఎంట్రీ ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్ పనులు పూర్తయ్యాయి. స్టేషన్ భవన సముదాయం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, సర్కులేటింగ్ ఏరియా నిర్మాణం సాగుతోంది. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితం కానుంది.
లిఫ్ట్, ఎస్కలేటర్ సైతం అందుబాటులోకి రానుందీ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో. కాచిగూడ, సికింద్రాబాద్ తరహాలో ఎస్కలేటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనుంది. ప్లాట్‌ఫామ్ రీసర్ఫేసింగ్ పనులు కొనసాగుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేశారు.

ఇదే జాబితాలో బేగంపేట్ రైల్వే స్టేషన్ చేరింది. దీని పునర్నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. పనుల పురోగతి గురించి వివరించారు.
అమృత్ భారత్ కింద 38 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. పనులు జోరుగా సాగుతున్నాయి. 90 శాతం వరకు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి. మరో అయిదారు నెలల్లో ఈ స్టేషన్ పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
పునర్నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇదివరకటితో పోల్చుకుంటే ఎన్నో రెట్లు మెరుగైన కనెక్టివిటీతో తెలంగాణ ప్రజలకు సేవలను అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు, అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్, సువిశాలమైన వెయిటింగ్ హాల్, ప్లాట్‌ఫామ్‌లు, సర్క్యులేషన్ ఏరియాలు, లిఫ్ట్, ఎస్కలేటర్ వంటి వసతులు ఉన్నాయని వివరించారు.
𝐁𝐞𝐠𝐮𝐦𝐩𝐞𝐭 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧, Secunderabad
— G Kishan Reddy (@kishanreddybjp) April 16, 2025
Redevelopment is nearing completion under the Amrit Bharat Station Scheme of @narendramodi Government.
Budget: ₹38 Crores.
Status update: 90% complete
The station is getting a modern facelift with:
– Improved… pic.twitter.com/HAQxNTzWXs
-
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications