గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. డిప్యూటీ తహసీల్దార్ సహా ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్ మహానగరంలో మరోసారి రేవ్ పార్టీ భగ్గుమంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ రేవ్ పార్టీపై దాడి ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రైడ్ లో 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. రేవ్ పార్టీపై దాడి ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రైడ్ లో 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి జరిపారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో డ్రగ్ పెడ్లర్లు తేజ, విక్రమ్ తోపాటు, ముగ్గురు వినియోగదారులు నీలిమ, పురుషోత్తం, భార్గవ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్, 8 ఎక్స్ టసీ గుళికలు, 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన డ్రగ్ సరఫరాదారు రాహుల్ అలియాస్ సోను, డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారు.

ఇక తేజ, విక్రమ్, నీలిమ ముగ్గురూ కలిసి గోవా, రాజమండ్రి, తదితర ప్రాంతాల్లో రేవ్ పార్టీలు నిర్వహించేవారని, మణిదీప్ రాజమండ్రిలో తన సొంత ఫామ్ హౌస్ లో తరచూ పార్టీలను ఏర్పాటు చేసేవారని తేలింది. నీలిమ, తేజ, విక్రమ్ లకు డ్రగ్స్ అలవాటు చేయడంలో మణిదీప్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications