తెలంగాణలో 'అరకు' ను మించిన అందాలు ఎక్కడంటే..?
తెలంగాణలో అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. జలపాతాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, పార్కులు, ఉద్యానవనాలు, అటవీ ప్రాంతాలు అనేకం పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. అయితే చుట్టూ పచ్చని కొండల మధ్య జంగిల్ సఫారీకి టూరిస్టులు ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇక్కడి వాతావరణం చూస్తే ఏపీలోని అరకును తలపిస్తుంది. అయితే టూరిస్టుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని దాదాపు 20 కి. మీ. మేర అటవీ ప్రాంతంలో సంచరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అదే మంచిర్యాల జిల్లాలోని గఢ్ పూర్ జంగిల్ సఫారీ..
మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ జంగిల్ సఫారీ పర్యటకులను కనువిందు చేస్తోంది. ఎత్తయిన కొండలు, పచ్చని దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య రహదారి ప్రయాణం అక్కడక్కడా పులులతోపాటు ఇతర జంతువులు కూడా కనువిందు చేస్తుంటాయి. ఇదే గఢ్ పూర్ జంగిల్ సఫారీ ప్రత్యేకత. అందుకే చాలా మంది ఈ ప్రాంతాన్ని ఏపీలోని అరకు అందాలతో పోల్చుతారు. ఇక్కడకు వెళ్తే అరకు అందాలను చూసిన ఫీలింగ్ కలుగుతుందని పర్యటకులు చెబుతున్నారు.

మంచిర్యాల పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో దాదాపు 20 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జంగిల్ సఫారీ ఉంది. ఈ గఢ్ పూర్ జంగిల్ సఫారీకి పర్యటకులు ఇటీవలి కాలంలో అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు 20 కిలోమీటర్ల మేర అడవిలో విహరించే విధంగా పలు ఏర్పాట్లు చేసింది. దాంతో ఇటీవలి కాలంలో మరింత సంఖ్యలో పర్యటకులు విచ్చేస్తున్నారు. ఈ అటవీ ప్రాంతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో భాగంగా ఉంది. ఇక్కడ పులులు, చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications