అభిమానానిక్కూడా కూసింత హద్దుండాలి భయ్యా

నేడు వినాయక చవితి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విఘ్న నాయకుడిని ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజిస్తోన్నారు. వీధి వీధినా వినాయకుడి మండపాలు వెలిశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లల్లో ఎటు చూసినా కోలాహలం నెలకొంది. పండగ సందడి కనిపిస్తోంది.

వివిధ రూపాల్లో విఘ్ననాయకుడు కొలువు దీరాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఆనవాయితీ ప్రకారం- ఖైరతాబాద్ వినాయకుడికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో గణేషుడి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు.

Ganesha Crafted as CM Revanth Reddy in Telangana

ఈ ఏడాది సుమారు 1.4 లక్షల విగ్రహాలు, వినాయకుడి మండపాలు ఏర్పాటయ్యాయి. నివాసాలు, కాలనీలు, సంస్థలు, అపార్ట్‌మెంట్‌లలో లక్షలాది గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వర్షం వల్ల అంతరాయం ఏర్పడినా సందడి మాత్రం తగ్గలేదు జంటనగరాల్లో. వినాయక చవితి సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

ధూల్‌పేట్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, దిల్‍సుఖ్‌నగర్, నాగోల్, బంజారాహిల్స్, అమీర్‌పేట్‌లో తాత్కాలిక విగ్రహ విక్రయ దుకాణాలు ఏర్పాటయ్యాయి. పర్యావరణ హిత మట్టి విగ్రహాలను ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రచారంతో చాలా మంది మట్టి గణేశ్ విగ్రహాలనే కొనుగోలు చేశారు.

ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం 69 అడుగుల ఎత్తుతో మూడు ముఖాలు, ఎనిమిది చేతులు కలిగి, ఏడు సర్పాల కింద కొలువై ఉంది. విశ్వ శాంతి మహాగణపతిగా దర్శనం ఇస్తోన్నాడిక్కడ గణేషుడు. దీని ఒక వైపు వాసవి అమ్మవారి ఆలయం, మరోవైపు గజ్జలమ్మ ఆలయం ఉన్నాయి. ఈ మండపాన్ని మొదటిసారి 1954లో ఒక అడుగు విగ్రహంతో ఏర్పాటు చేశారు.

కాగా- రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆకర్షించింది. ఫిషరిస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి తరహాలో విగ్రహాన్ని నెలకొల్పారు. ప్యాంట్, షర్ట్, షూస్ వేసుకుని, మెడలో ఆకుపచ్చని కండువాను ధరించి కనిపించాడు గణేషుడు.

ఈ మండపంలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ రైజింగ్ అనే అక్షరాలను పెద్దగా ముద్రించారు. నంబర్ వన్ అని అర్థం వచ్చేలా ఒకటో నంబర్ ను ఈ బ్యానర్ పై ప్రింట్ చేశారు. ఈ మండపం వివాదానికీ కేంద్రబిందువు అయింది. ఈ లోగోను వాడటం వల్ల అది.. అధికారికంగా ఏర్పాటైనట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+