• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఘరానా మోసగాడు: నకిలీ కార్డులతో బ్యాంకుల్లో లక్షలు దోచి ఇల్లు, కార్లు కొన్నాడు

By Srinivas
|

హైదరాబాద్: నకిలీ ఆధారాలు, తప్పుడు ధ్రువపత్రాలతో 196 పాన్ కార్డులు, 199 ఓటర్ కార్డులు తయారు చేసి బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా కార్యకలాపాలను పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు 14మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం విలేకరులతో వెల్లడించారు. వరంగల్ జిల్లాకు చెందిన జగన్మోహన్ రెడ్డి అలియాస్ శ్రీనివాస్ రెడ్డి అలియాస్ రాంరెడ్డి అలియాస్ మనోహర్ జగన్మోహన్ రెడ్డి పదో తరగతి చదివాడు.

పదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఉప్పల్లో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా, ఐసీఐసీఐ బ్యాంకు - సిటీ ఫైనాన్స్, ఆర్పీవీఎస్ చార్టెడ్ అకౌంట్ కార్యాలయాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్‌గా పని చేశాడు. ఆ సమయంలో క్రెడిట్ కార్డులను ఎలా పొందుతారో అధ్యయనం చేశాడు. విచారణాధికారిని మచ్చిక చేసుకుంటే క్రెడిట్ కార్డులు సులభంగా పొందవచ్చని గ్రహించాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

ఈ ఘరానా మోసగాడు నకిలీ గుర్తింపు కార్డుల ఆధారంగా పాన్ కార్డులు, ఓటరు కార్డులు సంపాదించి, వాటి సాయంతో క్రెడిట్ కార్డులు పొంది లక్షల రూపాయల్లో బ్యాంకులను బురిడీ కొట్టించాడు. ఇతనితో పాటు లంచాలను ఎరవేసి ప్యాన్, ఓటర్ కార్డులను సైతం పొందుతున్న 14 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

మంగళవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తన కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడిచారు. జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్‌గా పని చేసిన సమయంలో అతనికి వెరిఫికేషన్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఏర్పడి నకిలీ ప్యాన్ కార్డులు, ఓటరు కార్డుల తయారీకి శ్రీకారం చుట్టాడు. 196 ప్యాన్ కార్డులు, 199 ఓటరు కార్డులు 100 ఐటీ రిటర్న్స్ పత్రాలు తయారు చేసి 167 క్రెడిట్ కార్డులను పొంది రూ.65 లక్షలు కొల్లగొట్టాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

జగన్ నకిలీ పాన్ కార్డు పొందేందుకు తొలుత బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తాడు. స్థానికంగా ఉండే ఫొటో స్టూడియోలకు వెళ్లి, అక్కడ పని చేసే వారికి డబ్బులు ఎరవేసి కొంతమంది ఫొటోలను తీసుకుంటాడు. మరికొన్ని ఫొటోలను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసి తీసుకుంటాడు. ఆ ఫొటోలకు ఏదో ఒక పేరు, చిరునామాను ఇచ్చి ప్యాన్ కార్డు పత్రాన్ని నింపి తన అనుచరుడు భాస్కర్‌కు ఇస్తాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

ఆ పత్రాన్ని అటెస్ట్ చేసేందుకు నోటరీ చేసే తన మిత్రుడు యాదగిరి (స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, సబ్ ఆర్డినేట్ కోర్ట్స్ హైదరాబాద్, సికింద్రాబాద్)కి ఇస్తాడు. యాదగిరి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా రూ.30 తీసుకుని అటెస్టేషన్ చేసి ఇస్తాడు. ఈ అటెస్టేషన్‌తో ఉన్న నోటరీని న్యాయవాది ఈ సురేష్ రావు కోర్టులో దాఖలు చేస్తున్నారు. దీనికి అతను ఒక దరఖాస్తుకు రూ.900 తీసుకుంటున్నాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

ఈ విధంగా జగన్ జనన ధృవీకరణ పత్రాన్ని కోర్టు నుంచి పొందుతాడు. తర్వాత భాస్కర్ రూ.వెయ్యి తీసుకుని పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తాడు. నిబంధనల ప్రకారం పాన్ కార్డును కొరియర్ సంస్థలు దరఖాస్తుదారునికే అందచేయాల్సి ఉండగా వారికి కార్డుకు వెయ్యి చొప్పున ఇచ్చి జగన్ వాటిని నేరుగా తన వద్దకే తెప్పించుకుంటాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

ఓటరు కార్డు పొందేందుకు తప్పుడు పేరు, చిరునామా, ఇతర వివరాలతో కూడిన పత్రాన్ని జగన్ తన అనుచరుడు సాయిరాజ్‌కు ఇస్తాడు. అతను ఆ పత్రాన్ని తన స్నేహితుడు ఫేషన్ డిజైనరైన ఖాజా షఫీయుద్దీన్‌కు ఇచ్చి కార్డుకు రూ. 800 ఇస్తాడు. షఫీయుద్దీన్ దానిని తన స్నేహితుడు ఖాజా నజీర్ అహ్మద్‌కు ఇచ్చి కార్డుకు రూ.550 చొప్పున చెల్లిస్తున్నాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

ఖాజా నజీర్ ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి వివరాలను జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్‌లో పని చేస్తున్న కృష్ణకు తెలియ చేస్తాడు. ఇక్కడ కృష్ణ ఎటువంటి విచారణ చేయకుండానే ఓటర్ ఎపిక్ నంబరును ఇచ్చేస్తాడు. ఇలా ఎపిక్ నంబరు వచ్చిన వెంటనే ఖాజా నజీర్ అహ్మద్ మీ సేవా కేంద్రాల్లో ఓటరు ఐడీ కార్డు ప్రింట్ తీసుకుని జగన్‌కు అందిస్తారు. ఈ ఓటర్ కార్డు, ప్యాన్ కార్డులను అడ్రస్ ప్రూఫ్‌లుగా సమర్పించి జగన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి 75 క్రెడిట్ కార్డులు, ఎస్‌బీఐ నుంచి 55, ఇండస్ బ్యాంక్ నుంచి 3, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంక్ నుంచి 23 క్రెడిట్ కార్డులను పొందాడు.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

ఈ క్రెడిట్ కార్డుల స్వైపింగ్ కోసం జగన్ పెట్రోల్ బంక్‌లు, గిఫ్ట్స్ షాపుల వారికి మూడు శాతం కమీషన్‌ను ఎరవేసి 97 శాతం నగదును నేరుగా డ్రా చేసుకున్నాడు. ఈ గుర్తింపు కార్డులతోనే వందలాది సెల్‌ఫోన్ సిమ్‌కార్డులను తీసుకున్నాడు. అంతేకాకుండా ల్యాండ్‌లైన్ ఫోన్‌లను తీసుకుని టెలి ఎంక్వైరీలను పూర్తి చేసేవాడు. జగన్ తాను కొల్లగొట్టిన డబ్బుతో ఉప్పల్ ప్రాంతంలో ఓ ఇల్లు కోనుగోలు చేశాడు. అదేవిధంగా రెండు సరికొత్త కార్లను కూడా కొన్నాడు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకు వారు తాము జారీచేసి క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు డ్రా అవుతున్న విషయాన్ని గమనించి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి తీగ లాగితే గుట్టు రట్టయింది.

ఘరానా మోసగాడు

ఘరానా మోసగాడు

జగన్ ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతని నుంచి నకిలీ గుర్తింపు కార్డులు, పాన్‌కార్డులు, ఓటరు కార్డులు, క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన 13 మందిని అరెస్టు చేశారు. ఓటరు కార్డు, ప్యాన్ కార్డుల జారీతో పాటు జగన్ కేసులో వెలుగుచూసిన అంశాలపై ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, ఐటి కమిషనర్‌కు పంపుతామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అదే విధంగా ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gang comprising a systems operator of the GHMC and bank and courier service employees created hundreds of PAN cards, voter IDs and credit cards on fictitious names to cheat banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more