ఐపిఎస్ అధికారి హత్యకు నయీం కుట్ర: ఇంట్లోనే శవాలు?
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్‌ను హత్య చేసిన గ్యాంగ్‌స్టర్ నయీం తాజాగా ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో మరో ఐపీఎస్‌ను హత్య చేసేందుకు మావోయిస్టులతోనే ఒప్పందం చేసుకున్నాడా? అయితే ఈ హత్య అమలుకు ముందే హతమయ్యాడా? అంటే అవుననే అంటున్నారు.
వివరాల్లోకి వెళితే... చత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో చనిపోయిన వారిలో 26వ బెటాలియన్ కమాండర్ మడకామి దేవి, ఏరియా కమిటీ కమాండర్ మాసా, మరో ఇద్దరు ఉన్నారు. మృతుల బ్యాగుల్ని తనిఖీ చేసిన పోలీసులకు ఆయుధాలతో పాటు పత్రాలు లభించాయి.
ఈ పత్రాల్లో ఓ పోలీస్ అధికారిని హత్యకు ఒప్పందం కుదిరిందని, పథకం త్వరలో అమలవుతుందనే ఓ పేపర్‌ను పోలీసులు గుర్తించారు. ఆ మాజీ మావోయిస్టు ఎవరో కాదు ఇటీవలే పోలీసుల్ ఎన్ కౌంటర్‌లో హతమైన నయీం అని గుర్తించారు. దాంతో, నయీంను ఆశ్రయించిన ఆ మావోలు ఎవరు? డీల్ ఎంతకు కుదిరింది? యాక్షన్ టీం ఎవరు? అనే విషయం తేల్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇంట్లోనే శవాలా?
నయీం హత్య చేసిన చిన్నారులను నగర శివారు నెక్నెంపూర్‌లోని అల్కాపురి టౌన్‌షిప్ ఇంట్లోనే సమాధి చేశాడా? బంధువులు నదీమా అలియాస్ విజయ్ కుమార్, నస్రీన్‌తోపాటు హీనా, ఆమె కుమార్తె చియాన్‌నూ ఇక్కడే పాతిపెట్టాడని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.

కీలక సమాచారం రాబట్టిన సిట్ బృందం
ఫర్హానా, అఫ్సాలను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఆహార పదార్థాలతోపాటు మందులను ఆన్‌లైన్‌లోనే తెప్పించుకునేవారు. బిహార్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికీ నయీం గ్యాంగ్ దందాలు సాగుతున్నాయి.

ఒంగోలు, రాజమండ్రిల్లో రహస్య స్థావరాల
హైదరాబాద్‌తో పాటు తాజాగా ఒంగోలు, రాజమండ్రిల్లో రహస్య స్థావరాల గురించీ వెల్లడైంది. దీంతో తిరుమలహిల్స్, అల్కాపురి టౌన్‌షిప్‌ల్లోని నివాసాలను క్లూస్‌టీమ్స్ పరిశీలించినట్లు సమాచారం. మీడియా హడావుడి ఉండటంతో అర్ధరాత్రి ఆధారాల సేకరణ సాగిస్తున్నారు.

నయీం ఇంటి వద్ద షేక్ ఫయాజ్ అనే వ్యక్తి అరెస్ట్
కాగా, ఫర్హానా, అఫ్సా, ఫయీం, అతని భార్య షహీనలను ఓ బృందం వేర్వేరుగా హైదరాబాద్‌లో విచారిస్తుండగా.. నయీం భార్య, అత్తను షాద్‌నగర్‌లో మరో బృందం విచారిస్తోంది. శంషాబాద్ సమీపంలోని సాతంరాయిలో నయీం ఇంటి వద్ద షేక్ ఫయాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నయీం అకృత్యాలపై 30 కేసులు
భువనగిరికి చెందిన ఫయాజ్ నయీం వద్ద డ్రైవర్‌గా పనిచేసినట్లు గుర్తించారు. అతని నుంచి దేశవాళీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలోలోకల్ న్యూస్ చానల్‌కు చెందిన వ్యక్తిని, సిమ్‌కార్డులు సరఫరా చేసిన వ్యక్తినీ అరెస్టు చేశారు. నయీం అకృత్యాలపై 30 కేసులు నమోదు చేసినట్లు సిట్ ఐజీ తెలిపారు. నల్లగొండ జిల్లాలో 14; మహబూబ్‌నగర్ జిల్లాలో 4, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌ల్లో 7, కరీంనగర్‌లో 4, నిజామాబాద్‌లో ఒక కేసు నమోదు చేశామన్నారు.

నయీం ఆస్తులన్నీ ఫర్హానా పేరిటే
నయీం ఆస్తుల్లో అత్యధికం వంట మనిషిగా చలామణీ అయిన ఫర్హానా పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అల్కాపురిలోని ఇల్లును సికింద్రాబాద్ హస్తినాపురానికి చెందిన రత్తమ్మను బెదిరించి.. 200 గజాల స్థలంలో నాలుగంతస్తుల్లో నిర్మించిన కోట్ల రూపాయల ఇంటిని రూ.78 లక్షలకే కొన్నట్లు గుర్తించారు.

ఫర్హానా పేరుతో రిజిస్ట్రేషన్
ఆ ఇంటి పక్కన విలువైన ఖాళీ స్థలాన్నీ రూ.27 లక్షలు చెల్లించి ఫర్హానా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇతర రాష్ట్రాల్లోనూ ఫర్హానా పేరుతో ఆస్తులుండటంతో అక్కడికి తీసుకువెళ్లి ఆధారాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేశారు. భువనగిరి మండలం బస్వాపూర్‌లో చిక్కుల సత్యనారాయణ, చిక్కుల చంద్రయ్యల భూములను బలవంతంగా లాక్కున్నాడు.

ఆరు ఎకరాలను లాక్కుని ఇద్దరికీ చెరో లక్ష
ఎకరా రూ.20 లక్షల విలువ చేసే ఆరు ఎకరాలను లాక్కుని ఇద్దరికీ చెరో లక్ష మాత్రం చేతిలో పెట్టాడు. మరోవైపు తనిఖీల సమయంలో స్వాధీనం చేసుకున్న నోట్‌బుక్ (డైరీ)తోపాటు కంప్యూటర్‌లో ఉన్న కోడ్ భాషల్ని డీకోడ్ చేసే పనిలో సిట్ బృందం నిమగ్నమైంది.












Click it and Unblock the Notifications