అత్యాచారం, మిరప రసం తాగించి కొట్టేవాడు: బాలికలపై నయీం అకృత్యాలు
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. నయీం ఎన్ కౌంటర్ తర్వాత సోదాల్లో నయీం ఇంట్లోని బాలికలను సాక్షులుగా పేర్కొన్న పోలీసులు బుధవారం వారి వాంగ్మూలాలను కోర్టు ముందుంచారు.
ఫోటోలు: నయీంతో దర్జాగా ఓ ఎమ్మెల్యే, కలిస్తే క్లిక్‌మనాల్సిందే...తనకు పెళ్లి చేస్తానని చెప్పి నయీం అత్త సుల్తానా తనను ఆరు సంవత్సరాల క్రితం నయీం వద్దకు తీసుకొచ్చినట్లు ఓ బాలిక తెలిపింది. ఇందులో భాగంగా నయీం తరుచూ లైంగికంగా వేధించేవాడని, తమపై పలుసార్లు అత్యాచారం చేశాడని నయీం బాధిత బాలికలు పేర్కొన్నారు.
అత్యాచార అనంతరం కొన్ని ట్యాబ్లెట్లను బలవంతంగా తమ చేత మింగించేవాడని వారు తెలిపారు. నయీం అనుచరులు సుల్తానా, సాహెరా, సలీమా, ఫయీమ్ కూడా తమను ఎన్నో బాధలకు గురిచేసేవారని వారు కోర్టుకు సమర్పించిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

నయీంకు ఎదురు చెప్పినందుకు ఓ బాలికను నయీం హత్య చేశాడని వారు తెలిపారు. నయీం చెప్పినట్టు వినకపోతే మిరప రసం తాగించి తమను దారుణంగా హింసించేవాడని బాలికలు ఎంతో ఆవేదన చెందారు. ఇదిలా ఉంటే నయీంకు కేసు కోసం తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారి నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
నయీం కేసుకు సంబంధించి అన్ని వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి నయీంతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. నయీమ్‌తో ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా దర్యాప్తు అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే పలువరు నయీం అనుచరులను అదుపులోకి తీసుకోగా, మరికొంత మంది ఇంకా పరారీలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications