ఒడిశా టూ కర్ణాటక వయా హైదరాబాద్: గంజాయిదందా..సినీఫక్కీలో ఎస్కార్ట్; అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!!
వరంగల్ కమీషనరేట్ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ మరియు ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువగల 550 కిలోల గంజాయితో పాటు ఒక వ్యాన్, కారు, ద్విచక్రవాహనం మరియు ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ చందు, గుగులోత్ అనిల్, బానోత్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పిల్లలమర్రి శ్రీనివాసరావు, కన్నబోయిన దుర్గాప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కత్తా చిన్నారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు రాయపర్తి కి చెందిన నరసింహరావు ఆలియాస్ రాజును పట్టుకోవటానికి రంగంలోకి దిగామని పోలీసులు వెల్లడించారు.

గంజాయి దందా చేస్తున్నారిలా.. వివరాలు వెల్లడించిన సీపీ
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు నర్సింహరావు మరో నిందితుడు కన్నబోయిన దుర్గాప్రసాద్ తో కల్సి గత నాలుగు సంవత్సరాలుగా తనకు చెందిన వ్యాన్ మరియు కారులో ఒడిశా రాష్ట్రంలోని బలిమెల ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. తనకు వచ్చిన అర్డర్ల దృష్టిలో వుంచుకోని ప్రధాన నిందితుడు నర్సింహరావు అదేశాల మేరకు మిగితా నిందితులు ఒడిస్సా రాష్ట్రంలో 550 కిలోల గంజాయిని కోనుగోలు చేసి వాటిన రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి 275 ప్యాకేట్లను ఐచర్ వ్యాన్ లో రహస్యంగా భద్రపర్చి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలో విక్రయించేందుకు నిందితులు బయలుదేరారని పేర్కొన్నారు.

సినీ ఫక్కీలో.. గంజాయి వాహనానికి ఎస్కార్ట్.. పోలీసులకు పట్టుబడకుండా పక్కా స్కెచ్
నిందితులు పోలీసులకు చిక్కకుండా వుండేందుకుగాను పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా గంజాయి రవాణా చేస్తున్న వాహనానికి కొద్ది దూరంలో ముందుగా నిందితుల్లో కొందరు ఎస్కార్ట్ గా ద్విచక్రవాహనం, కారులో ప్రయాణిస్తూ పోలీసుల కదలికలను గమిస్తుండేవారని, పోలీసులకు పట్టుబడకుండా ఎస్కార్ట్ తో గంజాయి అక్రమ రవాణా చేసేవారని వెల్లడించారు.
అచ్చం సినీ ఫక్కీలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నట్టుగా వెల్లడించారు. నిందితులు బలిమెల నుండి చింతూరు, భద్రాద్రి కొత్తగూడ మహబూబాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ మరియు ఖానాపూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి బుధరావు పేట గ్రామ శివారులో తనిఖీలు చేసి పట్టుకున్నారని తెలిపారు.

తనిఖీలలో కోటికి పైగా విలువైన గంజాయి పట్టివేత..
అనుమానంతో పోలీసులు ఐచర్ వ్యాన్ మరియు ద్విచక్రవాహనం, కారులో వస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో నిందితులు వ్యాన్ లో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా అంగీకరించడంతో పోలీసులు వ్యాన్ ను తనీఖీ చేయగా రహస్యంగా భద్రపర్చిన కోటి రూపాయల పైన విలువ ఉన్న గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక వీరి నుండి గంజాయి స్మగ్లింగ్ కు సంబంధించి మరింత కూపీ లాగుతున్నారు పోలీసులు. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ఫో ర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, తో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులను, ఇతర పోలీసు అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications