తెలంగాణాలో కేసీఆర్‌ గ్రాఫ్‌ తగ్గుతుంది.. అందుకే ట్యూషన్‌ టీచర్‌ గా ప్రశాంత్ కిషోర్: గీతారెడ్డి సెటైర్లు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి పార్టీ సభ్యత్వాల పైన, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పరిస్థితిపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల సభ్యత్వాలతో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది అని మాజీమంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో కెసిఆర్ గ్రాఫ్ తగ్గుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటనపై మాజీమంత్రి గీతా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటనపై మాజీమంత్రి గీతా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటనపై గీతారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రం లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి పర్యటించారు ప్రశాంత్ కిషోర్. ఇక ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకోవడంపై మాజీ మంత్రి గీతారెడ్డి సెటైర్లు వేశారు

తెలంగాణాలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది అందుకే ట్యూషన్ టీచర్ పీకే

తెలంగాణాలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంది అందుకే ట్యూషన్ టీచర్ పీకే


తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గ్రాఫ్ పడిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని గీతా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతుందని పేర్కొన్న ఆమె ట్యూషన్ టీచర్ ని ఎందుకు పెడతాం? పిల్లలు వీక్ గా ఉంటేనే కదా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గ్రాఫ్ తగ్గి వీక్ అవడం వల్లే ట్యూషన్ టీచర్ ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారంటూ గీతా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆమె పేర్కొన్నారు.

దేశంలోనే కాంగ్రెస్ సభ్యత్వాల్లో తెలంగాణా నెంబర్ వన్

దేశంలోనే కాంగ్రెస్ సభ్యత్వాల్లో తెలంగాణా నెంబర్ వన్


మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై సంతృప్తి వ్యక్తం చేసిన గీతారెడ్డి బూత్ కమిటీ లలో కాంగ్రెస్ వీక్ గా ఉండేదని, కానీ బూతుల స్థాయిలో సభ్యత్వ నమోదుతో ఆ వెలితి పోయిందని పేర్కొన్నారు. దేశంలోనే సభ్యత్వ నమోదులో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని గీతారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సభ్యత్వ నమోదు లో మొదటి ప్లేస్ లో ఉందని చెప్పారు గీతారెడ్డి. నాలుగు లక్షల మెంబర్షిప్ తో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉందని వెల్లడించారు.

 హైదరాబాద్ లో సభ్యత్వాల నమోదుపై గీతా రెడ్డి అసంతృప్తి

హైదరాబాద్ లో సభ్యత్వాల నమోదుపై గీతా రెడ్డి అసంతృప్తి

హైదరాబాద్ నగరంలో మాత్రం ఆశించిన మేర సభ్యత్వాలు నమోదు కాలేదని గీతారెడ్డి పేర్కొన్నారు. అంబర్ పేటలో కేవలం 1600 సభ్యత్వం మాత్రమే నమోదయ్యాయని గీతారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోనూ చాలా తక్కువ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందని గీతా రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో కీలక నేతలు ఉండి కూడా తక్కువ సభ్యత నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని, బూత్ స్థాయిలో బలపడితేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన సాధ్యమవుతుందని గీతారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+