Huzurabad:తల్లి లాంటి పార్టీని గుండెల మీద తన్నాడు-ఈటలపై ట్రబుల్ షూటర్ ఫైరింగ్ స్పీచ్-హుజురాబాద్‌లో హామీల జల్లు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తన్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గులాబీ జెండాతో ఎదిగిన ఈటల... చివరకు అదే జెండాను మోసం చేశారని ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన ఈటల... ఇప్పుడేం చేస్తాడో ప్రజలు ఆలోచించాలన్నారు. హుజురాబాద్‌లో ప్రజలకు లాభం జరగాలా లేక ఈటలకు లాభం జరగాలా అనే విషయంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొని ప్రసంగించారు.

గెల్లు గెలుపు ఖాయం : హరీశ్ రావు

గెల్లు గెలుపు ఖాయం : హరీశ్ రావు

హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమైపోయిందని హరీశ్ రావు అన్నారు. ఈటల గెలిస్తే కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటాడు తప్ప నియోజకవర్గానికి ఏమీ చేయలేడని అన్నారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజురాబాద్‌లో ఈటల ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టించలేదన్నారు. దత్తత గ్రామం సిరిసేడులోనూ ఒక్క పనిచేయలేదన్నారు. మంత్రిగా పనిచేయని ఈటల ఇప్పుడేం చేస్తారో చెప్పాలన్నారు. ఈటలను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసింది సీఎం కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు.

ఈటలకు ఓటమి భయం...

ఈటలకు ఓటమి భయం...

'రైతు బంధు వద్దు,దళిత బంధు వద్దు,ఆసరా పెన్షన్లు పరిగె ఏరుకున్నట్లు అని ఈటల అంటున్నాడు. అలా మాట్లాడటం భావ్యమేనా... ఓవైపు రైతు బంధు వద్దంటూనే రూ.10లక్షలు ఆర్థిక సాయం అందుకున్నావు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పట్టుకుని రా అని మాట్లాడవచ్చా... నన్ను కూడా రారా అంటున్నాడు. అది ఆయన సంస్కారానికే వదిలేస్తాం. కానీ మేము మాత్రం రాజేందర్ గారు అని సంబోధిస్తాం.ఓటమి భయంతోనే ఈటల ఇలా మాట్లాడుతున్నాడు. అసహనంతో ఈటల చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.' అని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఒక్క ఇల్లు కట్టలేదు ఈటల...

ఒక్క ఇల్లు కట్టలేదు ఈటల...

హుజురాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 4వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేశారని హరీశ్ రావు అన్నారు. కానీ ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించే బాధ్యత తనదేనని చెప్పారు. అలాగే ఇల్లంతకుంటలో రామాలయాన్ని రూ.10కోట్లుతో అభివృద్ది చేస్తామన్నారు. సిద్దిపేటలో మహిళా సంఘ భవనాలు లేని ఊరు లేదని... హుజురాబాద్‌లోనూ గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే ఊరికో మహిళా సంఘ భవనం కడుతామని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యావ్‌ను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు.

అదేనా ఆత్మగౌరవం.. ఈటలకు హరీశ్ ప్రశ్న...

అదేనా ఆత్మగౌరవం.. ఈటలకు హరీశ్ ప్రశ్న...


ఈటల రాజేందర్ చెప్పేదొకటి,చేసేదొకటి అని హరీశ్ రావు విమర్శించారు.గడియారాలు,మిక్సీలు పంచి పెట్టడం ఆత్మగౌరవమా అని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో రెండు గుంటలకు,రెండు వందల ఎకరాలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ,అభివృద్ది పథకాలు,కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిందన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు.కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్‌ ఏమైనా అభివృద్ధి చేశారా? రూ.10 లక్షల పని కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్‌ ధర.రూ.105కు చేరిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదన్నారు. హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్,బీజేపీ మధ్యే ఉంటుందన్నారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని హరీశ్‌ అన్నారు. కాళేశ్వరం వచ్చాక ఎండాకాలం సైతం సాగునీరు పారిందన్నారు. కాళేశ్వరం తొలి ఫలితం హుజూరాబాద్‌ ప్రజలకే దక్కిందన్నారు. . అంతకుముందు,హుజూరాబాద్ నియోజకర్గంలోకి హరీష్ రావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్‌, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.అనంత‌రం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అక్క‌డి నుంచి జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకున్నారు. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గెల్లు శ్రీనివాస్ నేపథ్యం...

గెల్లు శ్రీనివాస్ నేపథ్యం...

హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్థుత టిఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పలుమార్లు అరెస్టయి జైలుకెళ్లారు. ఉద్యమకారుడు,బీసీ నేత,స్థానికుడు కావడంతో గెల్లు శ్రీనివాస్‌కు కేసీఆర్ అవకాశం కల్పించారు.క‌రీంన‌గ‌ర్ జిల్లా వీణ‌వంక మండ‌లం హిమ్మ‌త్ న‌గ‌ర్ గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం.ఆయన తల్లిదండ్రులు గెల్లు మ‌ల్ల‌య్య‌, ల‌క్ష్మీ.1983, ఆగ‌స్టు 21న జ‌న్మించిన గెల్లు శ్రీనివాస్... ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఇదే యూనివ‌ర్సిటీలో రాజ‌నీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.అంబ‌ర్‌పేట‌లోని ప్ర‌భుత్వ బీసీ హాస్ట‌ల్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన గెల్లు శ్రీనివాస్.. 2003 నుంచి 2006 వ‌ర‌కు హాస్ట‌ల్ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. ఆ కాలంలో బీసీ విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై పోరాడారు. డిగ్రీ చ‌దువుతున్న రోజుల్లో కేసీఆర్ ప్ర‌సంగాల‌కు ఆక‌ర్షితుడై తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు.గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ఉద్య‌మంలో శ్రీనివాస్ యాద‌వ్ ఎంతో పోరాడారని కొనియాడారు. ప్ర‌జల ఆశీర్వాదంతో మ‌రో టీఆర్ఎస్ విద్యార్థి నాయ‌కుడు అసెంబ్లీలో అడుగుపెట్ట‌బోతున్నాడనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+