వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు చోట్లే ఇవాంకా టూర్, హెలికాప్టర్‌లోనే మోడీ పర్యటన, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు 2017లో పాల్గొనేందుకు హైద్రాబాద్‌కు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ రెండు చోట్ల మాత్రమే పాల్గోంటారని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ఇవాంకా ట్రంప్ పర్యటన కోసం హైద్రాబాద్‌లో బారీ భధ్రతను ఏర్పాటు చేస్తున్నట్టు మహేందర్ రెడ్డి చెప్పారు.

జీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటుజీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటు

ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సదస్సులో పాల్గొనేందుకు నవంబర్ 28వ, తేదిన హైద్రాబాద్‌కు రానున్నారు. ఇవాంకా ట్రంప్ పర్యటన కోసం ఇప్పటికే అమెరికా భద్రతాధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు.

ఇవాంకా భోజనం: సెక్యూరిటీ రుచి చూశాకే, స్పెషల్ కిచెన్, మెడికల్ టీమ్ఇవాంకా భోజనం: సెక్యూరిటీ రుచి చూశాకే, స్పెషల్ కిచెన్, మెడికల్ టీమ్

అమెరికా భద్రతాధికారుల సూచనల మేరకు హైద్రాబాద్‌లో పోలీసులు ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విఐపి, వివిఐపిలు ఈ సదస్సులో పాల్గొనేందుకు రానున్నారు. దీంతో హైద్రాబాద్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇవాంకా టూరు రెండు చోట్లే

ఇవాంకా టూరు రెండు చోట్లే

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)కు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆమె షెడ్యూల్‌లో మరో ప్రాంతం లేదన్నారు. అయితే హైద్రాబాద్‌కు ఇవాంకా చేరుకొన్న తర్వాత ఆమె పర్యటనలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు అధికారులు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఈ రెండు చోట్ల మాత్రమే ఇవాంకా పర్యటించే అవకాశం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు.

 మూడు చోట్ల కంట్రోల్‌రూమ్‌లు

మూడు చోట్ల కంట్రోల్‌రూమ్‌లు

శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, ఫలక్‌నుమాల్లోనూ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు కంట్రోల్ రూమ్స్‌ను అనుసంధానిస్తూ డీజీపీ కార్యాలయంలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనిచేస్తుంది. ఈ కమాండ్ కంట్రోల్‌ నుండి పోలీసు ఉన్నతాధికారులు రక్షణ చర్యలను పర్యవేక్షించనున్నారు.

ట్రాఫిక్ కష్టాలు లేకుండా

ట్రాఫిక్ కష్టాలు లేకుండా

ఇవాంకా ట్రంప్, ప్రధాని మోడీ పర్యటనలను పురస్కరించుకొని హైద్రాబాద్ నగరంలో సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను చర్యలు తీసుకొంటున్నట్టు డీజీపీ అధికారులు చెప్పారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్‌లను ఎక్కువగా వినియోగించనున్నారు. ప్రధానికి సంబంధించి ఫలక్‌నుమా, శంషాబాద్‌ విమానాశ్రయం మినహ ప్రాంతాల్లో హెలికాప్ట్టర్‌లోనే ప్రధానమంత్రి పర్యటిస్తారు.ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండటంతో ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

10 వేల సిబ్బంది కేటాయింపు

10 వేల సిబ్బంది కేటాయింపు

ఇవాంకా మంగళవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెస్టిన్‌ హోటల్‌కు వెళ్లడంతో పాటు హెచ్‌ఐసీసీలో జరిగే జీఈఎస్‌లో పాల్గొంటారు. అనంతరం తాజ్‌ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. వీరి భద్రత కోసం సుమారు 10,400 మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు.6 వేల మంది సిబ్బందిని శాంతి భద్రతల కోసం , 60 ప్లటూన్స్ సాయుధ బలగాలను వినియోగిస్తున్నారు. 4 యూనిట్ల గ్రేహౌండ్స్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తారు. 1500 మంది సిబ్బందిని ట్రాపిక్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. దీనికి తోడు 9 ప్లటూన్స్ స్పెషల్ పోలీసులను వినియోగించనున్నారు.2 యూనిట్ల అక్టోపస్ టీమ్‌లు, 40 తనిఖీ బృందాలను వినియోగించనున్నారు.

English summary
With a couple of days left for the Global Entrepreneurship Summit (GES), elaborate security measures are being put in place with around 10,400 security personnel deployed across Hyderabad.Speaking to the media on Sunday, Director General of Police, M Mahender Reddy said that all the routes leading to the Hyderabad International Convention Centre (HICC), Falaknuma Hotel and Golkonda Fort would be monitored by nine different teams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X