Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలాంటి గొప్పవ్యక్తి వచ్చారు: ఇవాంకాపై కేటీఆర్ ఆసక్తికరం, అందుకే ఈ సదస్సు వచ్చింది

హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సు వల్ల హైదరాబాద్‌కు మరింత ప్రతిష్ట పెరిగిందని, పెట్టుబడులు పెరుగుతాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్లోబల్ సదస్సు గురించి వ్యాఖ్యానించారు. టీ హబ్ వల్లే జీఈఎస్ సదస్సు ఆతిథ్యానికి అవకాశం దక్కిందన్నారు.

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు రావడం గొప్ప ప్రయోజనం కలిగిందని చెప్పారు. ఇవాంకతో పాటు ఆమె ప్రతినిధి బృందానికి తెలంగాణను, హైదరాబాదును పరిచయం చేయగలిగామని తెలిపారు. విదేశీ సంస్థలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే తొలుత తెలంగాణను పరిగణలోకి తీసుకునే అవకాశముందన్నారు.

Recommended Video

    GES 2017: Ivanka Trump

    అలాంటి ఇవాంక మన వద్దకు వచ్చింది

    అలాంటి ఇవాంక మన వద్దకు వచ్చింది

    అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తి అని కేటీఆర్ అన్నారు. అంత ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తికి సలహాదారుగా ఉన్న ఇవాంక మన వద్దకు రావడం మనకు అందివచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. తెలంగాణపై సదభిప్రాయం కలిగి మన వద్దకు పెట్టుబడులకు అమెరికా సంస్థలను ప్రోత్సహించే వీలు ఉందన్నారు.

     గ్లోబల్ సమ్మిట్‌లో కేటీఆర్, ఇవాంకా మెరుపులు

    గ్లోబల్ సమ్మిట్‌లో కేటీఆర్, ఇవాంకా మెరుపులు

    గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు ఇవాంకా, చందా కొచ్చార్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాంకాకు కేటీఆర్ పలు ప్రశ్నలు వేశారు. ఇవాంకా పరిచయం సందర్భంలోను కొద్ది రోజులుగా ఇక్కడ ఐటీపై చర్చ సాగుతోందని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

     గోల్కొండ కోటలో విందు

    గోల్కొండ కోటలో విందు

    కాగా, బుధవారం సాయంత్రం గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం విందు ఇచ్చింది. రాత్రి 7 గంటల నుంచి పదిన్నర గంటల వరకు విందు జరిగింది. దాదాపు రెండువేల మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. సుమారు పద్దెనిమిది రకాల హైదరాబాద్‌ బిర్యానీలతో పాటు 200 తెలంగాణ వంటకాలను వడ్డించారు.

     విందులో వీరు పాల్గొన్నారు

    విందులో వీరు పాల్గొన్నారు

    18 రకాల చేపల వంటకాలు, 14 రకాల మాంసం, 50 రకాల శాకాహార రుచులను అతిథులకు పరిచయం చేశారు. వేడివేడి హైదరాబాద్‌ బిర్యానీ రుచులను ఆస్వాదించారు. విందులో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌, టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా, శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్‌, పి.మహేందర్‌రెడ్డి, బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.

     మానుషీ చిల్లర్‌కు సత్కారం

    మానుషీ చిల్లర్‌కు సత్కారం

    విందు సందర్భంగా మిస్‌ వరల్డ్‌ మానుషీ ఛిల్లర్‌ను ప్రభుత్వ తరఫున సత్కరించారు. విందును పురస్కరించుకుని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో గోల్కొండ కోట కొత్త అందాలను సంతరించుకుంది. వందలాది మంది విదేశీయులు బ్యాటరీ కార్లలో తిరుగుతూ రాత్రి సమయంలో కోట అందాలను తిలకించారు. అద్భుత అనుభూతులకు లోనయ్యామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

     ఆతిథ్యం బాగుందని అమెరికా ప్రతినిధి

    ఆతిథ్యం బాగుందని అమెరికా ప్రతినిధి

    మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులు, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో మధ్య హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే లఘుచిత్రాల ప్రదర్శన తిలకిస్తూ అతిథులు విందు ఆరగించారు. మానుషీ ఛిల్లర్‌ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విందు పూర్తయ్యాక ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఆతిథ్యం బాగుందని అమెరికా ప్రతినిధి క్రియోనియా పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+