గజల్ శ్రీనివాస్ ఇష్యూ: పక్కా స్కెచ్ వేసి, ఓ టీం పని చేసిందా అంటే? 'వీడియోలో మొత్తం'

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  హైదరాబాద్: తాను ఉద్యోగం వదిలేసి వెళ్తే మరో మహిళకు ఇలాంటి అన్యాయం జరిగేదని, అందుకే తాను వీడియోలు తీశానని గాయకుడు గజల్ శ్రీనివాస్ బాధితురాలు వెల్లడించారు. ఆమె ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెల్లడించారు. ట్రీట్మెంట్ కోసం న్యూడ్‌గా మారడం సరైనదేనా అని ఆమె వాపోయారు.

  గజల్ శ్రీనివాస్ అరెస్టు కోసం ఏ టీం పని చేయలేదని ఆమె వెల్లడించారు. ఆయన బాధితులు ఉంటే ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలన్నారు. మెల్లమెల్లగా లోబర్చుకునే ప్రయత్నాలు అతనివి అని ఆరోపించారు. గజల్ సతీమణి అప్పుడప్పుడు వస్తారని చెప్పారు. పక్కా ఆధారాలతో అరెస్టైన అతనికి శిక్ష పడుతుందన్నారు.

  తరుచూ పిలిచి, అసభ్యంగా చూసేవాడు

  తరుచూ పిలిచి, అసభ్యంగా చూసేవాడు

  సేవ్ టెంపుల్ చైర్మన్ ప్రకాశ్ గారు అందర్నీ చాలా మంచిగా చూసుకుంటారని బాధితురాలు చెప్పారు. గజల్ శ్రీనివాస్‌ను ఓ కొడుకులా చూసేవారన్నారు. ఆయనకు చెప్పే ధైర్యం చేయలేకపోయానని, అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించిందన్నారు. గజల్ శ్రీనివాస్ తరుచూ తనను పిలిచేవాడని, అసభ్యంగా చూసేవాడన్నారు. మనం ఎన్నో విషయాలు ఇప్పుడు చూస్తున్నామని, కెమెరా ద్వారానే చాలా విషయాలు బయటపడ్డాయని, అది గుర్తుకు వచ్చి తాను కెమెరా పెట్టానని చెప్పారు. తాను ఎవరి సహాయం తీసుకోలేదన్నారు. ఇరికించాలనే ఉద్దేశ్యంతో తాను పకడ్బంధీగా చేయలేదన్నారు. ఆయన చీకటి కోణాన్ని బయటపెడితే తప్పేమిటని ప్రశ్నించారు.

  'బెడ్రూంగా ఆ గది, గజల్ శ్రీనివాస్ బాగోతం వీడియోల్లో, ఆడదానితో ఎంజాయ్ కోసం, ఇలా బయటకు'

  డే టైంలోనే వీడియో ఫిక్స్ చేశా

  డే టైంలోనే వీడియో ఫిక్స్ చేశా

  తాను డే టైంలోనే ఆ వీడియో పిక్స్ చేశానని బాధితురాలు చెప్పారు. తాను కార్యాలయానికి ముందే వెళ్తానని, దేవుడికి పూలు, పూజలు చేస్తానని, అందుకోసం ముందు వెళ్లేదానిని అని చెప్పారు. అందరూ ఓ సమయానికి వస్తారని, కానీ కొన్ని సందర్భాలల్లో తాను ముందు వచ్చానని చెప్పారు. ఎక్కడ కనిపిస్తుందో చూసి మరీ ఆ డైరెక్షన్లో పెట్టానని చెప్పారు.

  ట్రయల్ వేశా

  తాను ఫ్లిప్ కార్టులో కెమెరా కొన్నానని బాధితురాలు వెల్లడించారు. ఎవరి సపోర్ట్ లేకుంటా కెమెరాను ఎలా పెట్టారని ప్రశ్నించగా.. అక్కడ పెట్టగానే పని చేస్తుందా లేదా తెలిసిపోతుందని ఆమె వెల్లడించారు. తాను అంతకుముందు ట్రయల్ వేశానని చెప్పారు.

  ఆ గజల్ శ్రీనివాస్ వీడియోలు, కొత్త ఆధారాలు: అమ్మాయి వస్తే

  స్కెచ్ వేసి ఉంచారో వీడియోలో ఉంది

  స్కెచ్ వేసి ఉంచారో వీడియోలో ఉంది

  గజల్ శ్రీనివాస్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ ఆయన భార్యకు, తల్లికి ఆ విషయాలు చెప్పలేని కదా అని బాధితురాలు అన్నారు. తాను ఓ వీడియో తీశానని, అందులో టైమింగ్‌తో సహా, పక్కా ప్లాన్‌తో స్కెచ్ వేసి పిలిపించినట్లుగా ఓ వీడియోలో ఉందని ఆమె వెల్లడించారు. ఆఫీస్‌కు గెస్టులు ఉన్నంతసేపు తనను ఉండమని చెప్పేవారన్నారు. తనకు అనుకూలమైన టైం దొరికినప్పుడు వీడియో పెట్టానని, ఇది డిసెంబర్ నెలలో పెట్టానని చెప్పారు.

  బెయిల్ ఇవ్వొద్దు, బెదిరిస్తారు: గజల్ శ్రీనివాస్ ఆకృత్యాలెన్నో, మరిన్ని వీడియోలు

  ప్రేమగా చూడమనే వారు

  ప్రేమగా చూడమనే వారు

  నాకు గవర్నర్ పదవి వస్తుందని, తనతో ప్రేమగా ఉంటే, మిమ్మల్ని నేను చూసుకుంటానని గజల్ శ్రీనివాస్ చెప్పేవారని బాధితురాలు చెప్పారు. అందరు అనుకున్నట్లుగానే గజల్ శ్రీనివాస్ చాలా మంచివారని తాను అనుకున్నానని చెప్పారు. కానీ ఇలాంటి వాడు అని తాను భావించలేదన్నారు.

  వీడియోలు తీయడం వెనుక టీం ఉందనడంపై

  వీడియోలు తీయడం వెనుక టీం ఉందనడంపై

  తాను ఆరు నెలలుగా బాధపడుతూ, ఇప్పుడు వీడియోలు పోలీసులకు బయటపెట్టడం వెనుక ఓ టీం ఉందని ఆరోపణలు రావడంపై బాధితురాలు స్పందించారు. తనకు కొందరు స్నేహితులు ఉన్నారని, వారికి విషయం చెప్పేదానిని అని వెల్లడించారు. శ్రీనివాస్ ప్రవర్తనలపై సహచరులకు చెప్పానని అన్నారు.

  వీడియో చూస్తే తెలుస్తుంది, కాలు పట్టుకున్నా

  వీడియో చూస్తే తెలుస్తుంది, కాలు పట్టుకున్నా

  కెమెరాలో ఎక్కడ కూడా బలవంతంగా తీసుకు వచ్చినట్లుగా లేదనే ప్రశ్నకు బాధితురాలు స్పందిస్తూ.. వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుందన్నారు. అక్కడ కెమెరా ఉందనే ధైర్యం తనకు ఉండేదని చెప్పారు. అక్కడ ఇలా జరుగుతుందనే, తనను వేధిస్తున్నారనే కెమెరా పెట్టానని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే వీడియోలు ఎలా వచ్చేవని అన్నారు. పార్వతి మసాజ్ చేస్తుంటే తాను కాలు పట్టుకున్నానని చెప్పారు.

  మరో వీడియోలో అంతా ఉంది

  మరో వీడియోలో అంతా ఉంది

  ఫిజియో థెరపీ అంటే ఎక్కడ గాయాలు అయితే అక్కడ చేయాలని, కానీ ఆయన దుస్తులు విప్పి మసాజ్ చేయించుకోవడం ఏమిటని బాధితురాలు ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఎంత క్షోభ అనుభవించానో గుర్తించాలన్నారు. అలాంటప్పుడు అది మసాజ్ లేదా ఫిజియో థెరపీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అక్కడ బెదిరించి, భయపెట్టి అలా చేశారన్నారు. కాస్త కాస్త పైపైకి జరిపించారన్నారు. అతని ఉద్దేశ్యం మరో వీడియోలో స్పష్టంగా ఉందన్నారు.

  నా వెనుక ఎవరూ లేరు, ఈ టీం పని చేయలేదు

  నా వెనుక ఎవరూ లేరు, ఈ టీం పని చేయలేదు


  తన వెనుక ఓ వర్గం ఉండి, ఓ టీం ఉండి ఇదంతా చేయించి ఉందనే ఆరోపణలపై బాధితురాలు స్పందించారు. తన వెనుక ఎవరూ లేరని, ఇదేం టీం వర్క్ కాదన్నారు. తన వెనుక ఆయన శత్రువులు లేరన్నారు. కేవలం ఆయన ప్రవర్తన వల్లే ఇదంతా బయటకు వచ్చిందని చెప్పారు. అతను తప్పు చేయడం వల్లే జైలుకు వెళ్లాడన్నారు. ఇది నెలలుగా స్కెచ్ వేసి, ప్లాన్ వేసి చేసింది కాదన్నారు. తన వెనుక ఎవరూ లేరని, ఏ రాజకీయ పార్టీ లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా మంచి చేయాలని చూస్తుంది కానీ, చెడు ఎందుకు చేస్తుందన్నారు.

  ఆమెనే మసాజ్ చేస్తామని చెప్పారు.. పార్వతి స్పందన

  ఆమెనే మసాజ్ చేస్తామని చెప్పారు.. పార్వతి స్పందన


  బాధితురాలి ఆరోపణలపై పార్వతి స్పందించారు. గజల్ శ్రీనివాస్‌కు ప్రమాదం జరిగిందని, తనకు ఫిజియోథెరపీ తెలుసునని, మీరు ఎందుకు బాధపడుతున్నారని, నేను మసాజ్ చేస్తానని ఆ బాధితురాలు చెప్పారని పార్వతి అన్నారు. ఆయన వద్దకు వెళ్లాలని తాను బాధితురాలిని బలవంతం చేయలేదని చెప్పారు. అక్కడ ఎవరి పని వారు చేసుకుంటారని, ఎవరూ ఎవరిని బలవంతం చేయలేదన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Following the serious sexual harassment allegations slapped on him, Ghazal singer Srinivas has been removed as the brand ambassador of the America-headquartered Global Hindu Heritage Foundation and the Save Temples Campaign sponsored by it with immediate effect.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి