వినాయక నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు - ప్రధాన మార్గాల మూసివేత, రూట్ మ్యాప్..!!
గణేష్ నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం సిద్దమైంది. సాగరతీరానికి గణనాధులు తరలి వచ్చే మార్గం లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, సిటీ పోలీసు అదనపు సిబ్బందిని మోహరించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెల 6,7 తేదీల్లో నిమజ్జనం కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రధాన మార్గాలను మూసివేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ప్రకటించారు.
ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రాకపోకలకు పోలీసుల ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్ప్ లైన్లు నెంబర్లను అధికారులు ప్రకటించారు.
వినాయక నిజమజ్జనానికి సర్వం సిద్దమైంది. తొమ్మది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధులు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో పోలీసులు సెప్టెంబరు 6, 7 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి విగ్రహాలు హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిరానున్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైన బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట, చార్మినార్, అబిడ్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్‌బండ్ వైపు సాగుతుంది. అదేవిధంగా, సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి.

టోలిచౌకీ, మెహిదీపట్నం, లక్డీకాపూల్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తాయి. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలను ఎంజే మార్కెట్ వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ప్రధాన మార్గాలన్నింటిలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, నగరంలోని వివిధ జోన్లలో ట్రాఫిక్‌ను భారీగా మళ్లించనున్నారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఇతర మార్గాల వైపు మళ్లిస్తున్నారు.మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయి. ఇక, లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ జంక్షన్లను పూర్తిగా మూసివేస్తారు. నార్త్ జోన్‌లో పాట్నీ, పారడైజ్, రాణిగంజ్ చౌరస్తాలలో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తారు.
విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) మార్గాన్ని మాత్రమే ఉపయోగించాలని పోలీసులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునే వారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు సైతం రద్దీ సమయాల్లో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే వచ్చి వెళ్లనున్నాయి. ప్రభుత్వం తరఫున కూడా పర్యావరణ హిత నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లను సిద్ధం చేశారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications