హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్తల వెల్లువ.. చార్మినార్ దగ్గర అలా!

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది జిహెచ్ఎంసి. ఆస్తిపన్ను వడ్డీ చెల్లింపులో 90 శాతం రాయితీని కల్పించడానికి కీలక తీర్మానాన్ని చేయడంతోపాటు, చార్మినార్ సమీపంలో రద్దీ తగ్గించడానికి బహుళ స్థాయి పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నగర అభివృద్ధికి సంబంధించిన అనేక తీర్మానాలను జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో చేశారు.

ఆస్తిపన్ను వడ్డీ చెల్లింపులపై 90% రాయితీ
జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధికి సంబంధించిన 24 తీర్మానాలకు ఆమోదం లభించింది. అందులో ముఖ్యంగా ఆస్తిపన్ను వడ్డీ చెల్లింపులపై 90% రాయితీ కల్పించడానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ ఒక కీలక తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. దీనికోసం వన్ టైం సెటిల్మెంట్ కు మరొక అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది.

GHMC good news Traffic woes at Charminar are under control with the parking complex

ఆ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఏ ఓ సి సెంటర్ చుట్టూ ఫ్లైఓవర్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ప్రత్యామ్నాయ మార్గ నిర్మాణం కూడా ఉన్నాయి. ఇదే సమయంలో ఫలక్నుమా వద్ద సమాంతర ఆర్ వో బి, ఫతేనగర్ ఫ్లైఓవర్ మరమత్తు పనులకు సవరించిన పరిపాలన అనుమతి కూడా జారీ చేయబడింది. అబిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ లోని 56 సెల్లార్ దుకాణాలను వేలం ద్వారా అప్పగించడం కోసం కౌన్సిల్ అనుమతించింది.

చార్మినార్ వద్ద పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదన ఆమోదం
కెపిహెచ్ బి ఫోర్త్ ఫేజ్ లోని ఫంక్షన్ హాల్ లో ఐదు కోట్ల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది. చార్మినార్ సమీపంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, రద్దీ లేకుండా చేయడానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ కింద ఖిల్వత్ వద్ద బహుళ స్థాయి పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనను జిహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదించింది.

10 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్వహణ కోసం ప్రైవేట్ టెండర్ లు
ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ప్రారంభంలో 15 సంవత్సరాల రాయితీ వ్యవధితో ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా మరో ఐదు సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాక ఖైరతాబాద్ జోన్ లోని 10 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్వహణ కోసం ప్రైవేట్ టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణ కోసం ప్రైవేట్ ఆపరేటర్ కు లీజ్ కు ఇవ్వాలని నిర్ణయించింది.

ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ నుంచి సంతోష్ నగర్ వైపు డౌన్ రాంప్
వ్యర్థాల సేకరణ, ఫాగింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే జిహెచ్ఎంసి వాహనాలకు జిపిఎస్ ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ నుంచి సంతోష్ నగర్ వైపు డౌన్ రాంప్ కోసం ఏడు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా రోడ్డు అభివృద్ధి ప్రణాళికకు జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+