టీవీ సెట్ మీద పడి రెండేళ్ల బాలిక దుర్మరణం
నల్లగొండ: ఇంట్లో ఆటాడుకుంటున్న బాలికపై టీవీ సెట్ పడి మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా చెవ్వెంల మండల పరిధిలోని వల్లభాపురంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గుండి సైదులు రజితల కుమార్తె పల్లవి(2) తల్లిదండ్రులు పనుల నిమిత్తం వీధిలోకి వెళ్లగా ఆటలాడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
దీంతో స్టాండ్‌పై నుంచి టీవీ మీద పడి బాలిక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఆస్పత్రికి తరలించేలోగానే ఆమె మరణించింది. చిన్న సైకిల్‌తోఆటాడుకుంటుండగా టీవీ సెట్ మీద పడిందని పోలీసులు చెప్పారు. సైకిల్ టీవీ స్టాండ్‌కు తాకడంతో టీవి కింద పడి ఉంటుందని భావిస్తున్నారు.

టీవీ మీద పెడగానే బాలిక కెవ్వుమని కేక పెట్టింది. దాంతో హుటాహుటిన పరుగెత్తుకొచ్చింది. పగిలిన టీవి సెట్ కింద కాళ్లూ చేతులు కొట్టుకుంటున్న కూతురుని చూసి, ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది.
తలకు తీవ్రమైన గాయం కావడం వల్లనే పల్లవి మరణించినట్లు వైద్యులు తేల్చారు. బంధువుల విజ్ఞప్తి మేరకు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications