ప్రియుడి ఫ్యామిలీ వేధింపు, యువతి సూసైడ్ (ఫోటో)

హైదరాబాద్: ప్రియుడి కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీసులు కథనం ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన సాగర్ కొంతకాలంగా ప్రేమించికుంటున్నారు.

 Girl commits suicide in Hyderabad

దీంతో సాగర్ కుటుంబ సభ్యులు ఆ యువతిని బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపంతో ఆమె ఈ నెల 22వ తేదీన విషం తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. సాగర్ కుటుంబ సభ్యులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు యువతి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.

జవాను ఆత్మహత్య

కొత్తగా ఇల్లు నిర్మించుకున్న ఓ సైనికుడు గృహ ప్రవేశం కోసం ఇంటికి వచ్చాడు. అయితే, తండ్రి అనారోగ్యంపాలు కావడం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన మధు పెద్ద కుమారుడు సతీష్ రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. ప్రస్తుతం మీరట్లో పని చేస్తున్నాడు.

 Girl commits suicide in Hyderabad

ఎల్లారెడ్డిగూడలో ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం నిమిత్తం ఫిబ్రవరి 7న హైదరాబాదుకు వచ్చాడు. మూడు రోజుల క్రితం గృహప్రవేశం పూర్తయింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. అయితే ుదయం లేచి చూసేసరికి అతను ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. ఆర్థిక ఇబ్బందులతోనే సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+