ఆత్మహత్యలు: 16వ అంతస్థు నుంచి దూకి యువతి, వివాహిత, విద్యార్థి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో బుధవారం ఒకేరోజు మూడు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ యువతి 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, మరో ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు. ఇంకో ఘటనలో వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

మొదటి ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ శ్రీనివాసులు వెల్లడించారు. ఖానమెట్‌లోని మీనాక్షీ స్కైలాంజ్ అపార్ట్‌మెంట్ పొలారిస్ బ్లాక్‌లోని 16వ అంతస్తు ప్లాట్‌నంబర్ 1606లో వైజాగ్ ఫోర్టులో పనిచేసే మోహన్‌కృష్ణంరాజు నివాసం ఉంటున్నాడు. ఆగస్టు నెలలో ఇంట్లో ఓ శుభాకార్యం పనుల నిమిత్తం వెస్ట్‌గోదావరి జిల్లా గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19)ను నియమించుకున్నాడు.

బుధవారం ఉదయం 16వ అంతస్తు బాల్కని నుంచి పడి వెన్నల చనిపోయింది. ఈ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. తానే స్వయంగా దూకి చనిపోయిందా, లేకా ఎవరైనా తోసేశారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం వెన్నెల మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

కట్న వేధింపులకు వివాహిత యువతి బలి

వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన
బాలానగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పి భిక్షపతిరావు కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నాగేశ్వరరావు, నాగమణి కుమార్తె కొప్పాక హరిణి(27)ని అదే జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెం గ్రామానికి చెందిన కృష్ణారావు, రత్నాజీ కుమారుడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసే శ్రీనివాస్‌కు ఇచ్చి గత సంవత్సరం జూన్‌లో వివాహం జరిపించారు.

ఆ సమయంలో రెండెకరాల పొలం, రూ.10లక్షల నగదు కట్నం కింద ఇచ్చారు. పెళ్లయిన తర్వాత దంపతులు నగరానికి వచ్చి వినాయకనగర్‌లోని శ్రీనివాస్‌ బాబాయి నాగభూషణం ఇంట్లో కాపురం పెట్టారు. ఇష్టంలేని పెళ్లి చేశారంటూ శ్రీనివాస్‌ దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పి బాధ పడింది.

రెండు మాసాలుగా రూ.10లక్షలు అదనపు కట్నం కావాలని పొలం తన పేరుకు మార్చాలంటూ హరిణి భర్త శ్రీనివాస్‌, అతని తల్లిదండ్రులు, బాబాయి నాగభూషణం దంపతులు, ఇతని అత్త వేధిస్తున్నారు. దీంతో హరిణి మంగళవారం బెడ్‌రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మంగళవారం సాయంత్రం శ్రీనివాస్‌ పిన్ని వెళ్లి తలుపు కొట్టగా తీయకపోవడంతో ఆమె భర్త నాగభూషణంకు ఫోన్‌ చేసింది. ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగిని పంపగా కిటికీ తీసి చూడడంతో లోపల ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.

పోలీసులు శ్రీనివాస్‌తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికిందని సీఐ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను అత్తింటి వారే చంపారంటూ ఆరోపించారు.

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి బెడ్‌షీట్‌తో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్‌ సీఐ డీవీ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ముల్కూరు మండలం మాణిక్‌బండార్‌కి చెందిన దేవేందర్‌ కుమారుడు సూదుల శ్రీకాంత్‌ (19) కండ్లకోయలోని సీఎంఆర్‌ ఐ.టి. ఇంజినీరింగ్‌ కళాశాలలో సీ.ఎస్‌.సి. ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

నెలక్రితం ఇతడు కొంపల్లిలోని బృందావన్‌ వసతిగృహంలో చేరాడు. బుధవారం కళాశాలకు వెళ్లకుండా వసతిగృహంలోనే ఉన్నాడు. సాయంత్రం తోటి విద్యార్థులు తిరిగి వచ్చినా ఇతడు ఉంటున్న గదినుంచి బయటకు రాలేదు.

తలుపులు బద్దలుగొట్టి చూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. కాగా, మృతుడు తన చరవాణిలో నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని టైపు చేసి ఉంది. అయితే మేసేజ్‌ ఎవరికీ పంపలేదు. ఎస్సై ఎం.వెంకటేశం దర్యాప్తు చేస్తున్నారు.

వెన్నెల ఆత్మహత్య

వెన్నెల ఆత్మహత్య

ఖానమెట్‌లోని మీనాక్షీ స్కైలాంజ్ అపార్ట్‌మెంట్ పొలారిస్ బ్లాక్‌లోని 16వ అంతస్తు ప్లాట్‌నంబర్ 1606లో వైజాగ్ ఫోర్టులో పనిచేసే మోహన్‌కృష్ణంరాజు నివాసం ఉంటున్నాడు. ఆగస్టు నెలలో ఇంట్లో ఓ శుభాకార్యం పనుల నిమిత్తం వెస్ట్‌గోదావరి జిల్లా గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19)ను నియమించుకున్నాడు.

వెన్నెల ఆత్మహత్య

వెన్నెల ఆత్మహత్య

బుధవారం ఉదయం 16వ అంతస్తు బాల్కని నుంచి పడి వెన్నల చనిపోయింది. ఈ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. తానే స్వయంగా దూకి చనిపోయిందా, లేకా ఎవరైనా తోసేశారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం వెన్నెల మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

వివాహిత హరిణి ఆత్మహత్య

వివాహిత హరిణి ఆత్మహత్య

వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన

విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్య

విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్య

నెలక్రితం ఇతడు కొంపల్లిలోని బృందావన్‌ వసతిగృహంలో చేరాడు. బుధవారం కళాశాలకు వెళ్లకుండా వసతిగృహంలోనే ఉన్నాడు. సాయంత్రం తోటి విద్యార్థులు తిరిగి వచ్చినా ఇతడు ఉంటున్న గదినుంచి బయటకు రాలేదు. తలుపులు బద్దలుగొట్టి చూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Girl committed suicide at Madhapur in Hyderabad on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి