హాస్టల్లో బాలిక ప్రసవం: నిందితుడు ధను కాదు, దిలీప్ సర్కార్
హైదరాబాద్: తొమ్మిదో తరగతి బాలికను తల్లి చేసిన వ్యక్తిని హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు గుర్తించారు. అతడి పేరు ధను కాదని, పశ్చిమ బెంగాల్‌కు చెంది దిలీప్ సర్కార్ అని పోలీసులు నిర్ధారించారు.
పశ్చిమ బెంగాల్ భవన్‌పూర్ దక్షిత్ పార, టీటానగర్‌కు చెందిన దిలీప్ సర్కార్ (37) బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి కొండాపూర్‌లోని సోనీ ఎంక్లేవ్ ఫ్లాట్ నెంబర్ 1078లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

మాదాపూర్ ఫార్చూన్ టవర్ సమీపంలో తుంపా అనే బెంగాలీ ఫుడ్స్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. కొంత కాలం క్రితం చంద్ర నాయక్ తండా వైపు వెళ్తుండగా బాధితురాలి రెండో అక్కతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో బాలికపై అతని కన్ను పడింది. ఆమెతో స్నేహంగా మెలుగుతూ ఆతను తన కోరికను తీర్చుకున్నాడు.
అయితే, బాలిక మాత్రం ధను పేరు చెప్పింది. అయితే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుడిని దిలీప్ సర్కార్‌గా గుర్తించారు. నిందితుడు పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడని, పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications