కోరిక తీర్చలేదని.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ అమ్మాయిని చంపేశాడు (పిక్చర్స్)

హైదరాబాద్: గండిపేట శివారులోని ఓ ఫాం హౌజ్ సమీపంలో ఆదివారం దారుణ హత్యకు గురైన అమ్మాయి అమీనా కేసును నార్సింగి పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. ఆమెను చంపేసింది పాతబస్తీకి చెందిన అక్బర్. అతనిని అరెస్ట్ చేసి విచారించారు.

మృతురాలు అమీనాను నిందితుడు అక్బర్ ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెబితే ఆమె నమ్మింది. కోరిక తీర్చమని నిందితుడు అడిగితే అందుకు ససేమీరా అన్నది. అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. చివరకు అతని చేతిలో మృతి చెందింది.

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు దారితీసిన పరిస్థితులను నిందితుడి నుంచి రాబట్టారు. సోమవారం రాత్రి నార్సింగ్‌ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్‌ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్‌ వివరాలు వెల్లడించారు.

 అమీనాను ప్రేమిస్తున్నానని..

అమీనాను ప్రేమిస్తున్నానని..

చాంద్రాయణగుట్ట ప్రాంతంలో కూరగాయల వ్యాపారి కూతురు అమీనా వయస్సు పద్నాలుగేళ్లు. ఫలక్‌నుమా ప్రభుత్వ బాలిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి కోసం తరచూ ఇంటికి వచ్చే అక్బర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ బైక్‌పై తిప్పేవాడు. సరదాగా తిప్పుతూ కావాల్సినవి కొనిస్తూ స్నేహం పెంచుకున్నాడు. ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళుతూ ముచ్చట తీర్చేవాడు.

 లొంగదీసుకోవాలనుకుంటే ససేమీరా

లొంగదీసుకోవాలనుకుంటే ససేమీరా

అప్పటికే పెళ్లయిన అక్బర్‌ బాలికను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. పెళ్లి పేరిట డ్రామా ఆడాడు. ఇదే సమయంలో బాలిక కుటుంబ సభ్యులు... ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు సాయం చేయమని అక్బర్‌ను కోరారు. ఈ దశలో డబ్బు కాజేయాలని పథకం వేశాడు. ఇంట్లో దాచిన నగలు, డబ్బు తీసుకొస్తే పెళ్లి చేసుకుని హాయిగా ఉందామంటూ అమీనాకు మాయమాటలు చెప్పాడు. ముంబై, దుబాయ్‌ వెళ్లి జీవితాన్ని ఎంజాయ్‌ చేయవచ్చంటూ ప్రలోభ పెట్టాడు. కుటుంబసభ్యులు ఆదివారం హడావిడిగా ఉన్నారు. వారు నిద్రపోతున్న సమయంలో వారు ఇంట్లో దాచిన 40 వేలు, నగలు తీసుకొని బాలిక బయటకు వచ్చింది.

 ప్లాన్‌తో వచ్చి, కోరిక తీర్చమన్నాడు

ప్లాన్‌తో వచ్చి, కోరిక తీర్చమన్నాడు

అనంతరం ఆమెను ద్విచక్ర వాహనం పైన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాలనుకున్నాడు. నార్సింగ్‌ నుంచి గండిపేట వెళ్లే దారిలో చాలా ప్రాంతాలు వెతికాడు. అనువుగా లేదని భావించాడు. చివరకు గండిపేట రహదారిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. బాలిక వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకున్నాడు.

 కోరిక తీర్చమంటే నో చెప్పిన అమ్మాయి

కోరిక తీర్చమంటే నో చెప్పిన అమ్మాయి

ఆ తర్వాత తన కోరిక తీర్చమని అక్బర్‌ ఆమెను ఒత్తిడి చేశాడు. లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. పెళ్లి తర్వాతనే అంటూ తేల్చి చెప్పింది. అతను వదలకపోవడంతో పారిపోయేందుకు సిద్ధపడింది. దీంతో అక్బర్ కోపంతో కొట్టాడు. బుర్కాను చింపి చేతులు కట్టేశాడు. మాట వినలేదనే కసితో తన వెంట తీసుకెళ్లిన కత్తితో బాలిక గొంతు కోశాడు. చనిపోయిందని భావించి వెళ్లిపోబోతుండగా కేకలు వేసింది. భయపడిన అక్బర్‌ బాలిక ముఖంపై బండరాయితో మోది హతమార్చాడు.

 సీసీ కెమెరానే పట్టించింది

సీసీ కెమెరానే పట్టించింది

కేసు నమోదుచేసిన పోలీసులు నగరంలో మిస్సింగ్‌ కేసుల వివరాలు పరిశీలించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్‌ కేసు వివరాలు పరిశీలించారు. రెండు వివరాలు సరిపోల్చారు. బండ్లగూడ, గండిపేట, నార్సింగ్‌ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాల నుంచి ఫుటేజీ సేకరించారు. ఆధారాలు లభించాయి. కాల్‌డేటా ఆధారంగా అక్బర్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. నిందితుడు అక్బర్‌కు ఐదు నెలల క్రితం వివాహం అయినట్లు దర్యాప్తులో వెల్లడయింది. అతడి నుంచి కత్తి, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+