బావిలో యువతి శవం, ఒంటిపై జాకెట్ మాత్రమే: రేప్ చేసి చంపేశారా?
కరీంనగర్: కరీంనగర్ జిల్లాో కందుగుల గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మంగళవారం రాత్రి కనిపించిన మృతదేహం సంచలనం సృష్టించింది. ఆమెను యువతి జ్యోతిగా గుర్తించారు. ఈ సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియాలో ఈ మేరకు గురువారం వార్తాకథనాలు వచ్చాయి.
ఈ నెల 11న రాత్రి ఇంటి ముందు పడుకున్న జ్యోతి అదే రాత్రి నుంచి కనిపించుకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఫలితం కనిపించికపోవడంతో గతంలో జ్యోతికి సన్నిహితంగా ఉండే అదే గ్రామానికి చెందిన యువకుడు తీసుకెళ్లి ఉంటాడని భావించారు. అయితే ఎంతకీ జ్యో తి ఆచూకి లభించకపోవడంతో తమ కూతురు కనిపించడం లేదని మంగళవారమే పోలీసులను సంప్రదించారు.

ఖాకీలు యువతి గురించి ఆరా తీస్తుండగానే, జ్యోతి మృతదేహం కందుగులలోని ఓ వ్యవసాయ బావిలో కనిపించింది. అయితే జ్యోతి మృతదేహన్ని చూస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరతో బయటకు వెళ్లిన జ్యోతి ఒంటిపై కేవలం జాకెట్ మాత్రమే ఉంది. అయితే ఆమెపై లైంగికదాడి చేసి చంపేసి బావిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కూడా ఎటూ తేల్చుకోలేక సేకరించిన ఆధారాలతో సీనియర్లను సంప్రదించినట్లు తెలిసింది. జ్యోతి తల్లిదండ్రులు మాత్రం గ్రామానికి చెందిన ఇమ్మడి క్రాంతి అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుజూరాబాద్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications