ఎత్తుకెళ్లి బాలికపై బిటెక్ విద్యార్థి రేప్: అవమానంతో ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఓ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిగింది. ఈ బిటెక్ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అవమానంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ స్పందించంది.
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్‌ఖాన్ సమగ్ర నివేదిక అందజేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లకు శుక్రవారం నోటీసులు జారీచేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మరో ఐదు లక్షలతో ఆ బాలికకు వైద్యం చేయించాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోడేపల్లికి చెందిన తొమ్మిదోతరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడనే ఆరోపణపై అదే గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బొబ్బిలి నర్సయ్య అలియాస్ నరేశ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి నిర్భయ, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
యాభై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికను వైద్యచికిత్సల కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై కమిషన్ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు సారా మాథ్యుస్, కుదీశ్ తబసూమ్, అనిత, సనా వాహబ్, కురల్ రసన్ శుక్రవారం కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె బంధువులను కలిసి విచారించింది.
బాలికను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా, నిజామాబాద్ ఎంపీ కే కవిత కార్పొరేట్ దవాఖానకు తరలించాలని ఎస్పీ, కలెక్టర్లకు సూచించడంతో, బాలికను అపోలోకు తీసుకొచ్చినట్టు రసూల్‌ఖాన్ తెలిపారు. బాలికను కార్పొరేట్ దవాఖానకు తరలించేందుకు చొరవ చూపిన ఎంపీ కవిత, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లను మైనారిటీ కమిషన్ అభినందించింది.












Click it and Unblock the Notifications