మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు ఆటో డ్రైవర్ల అత్యాచారం
హైదరాబాద్: హైదరాబాదులో ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యంత నీచమైన కార్యానికి ఒడి గట్టారు. మతిస్థిమితంలేని ఓ బాలికపై ముగ్గురు ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా శనివారం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల ఇంద్రప్రస్థానం కాలనీలో ఉంటున్న ఓ బాలికను ఆటో డ్రైవర్లు అనిల్, శివ, మరొకరు కలిసి గుర్రంగూడ అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం అనిల్, శివలను అదుపులోకి తీసుకోగా మరో ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు.

ఇదిలావుంటే, అప్పుల బాధతో ఒక పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారంనాడు వరంగల్ నర్మెట మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి శ్రీనివాస రెడ్డి (35) తన రెండు ఎకరాల పొలంలో 8 బోర్లు వేశాడు. అయినా చుక్క నీరు పడలేదు. ఇందుకు అతను 9 లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు.
దానికితోడు, వర్షాలు లేకపోవడంతో సాగుచేసిన పత్తిపంట ఎండిపోయింది. అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురై శ్రీనివాస రెడ్డి పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్. ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.












Click it and Unblock the Notifications