ఫేస్‌బుక్ ప్రేమ: బర్త్ డే అని పిలిచి రెండ్రోజులపాటు రేప్ చేశాడు

నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఓ బాలికను లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు.

హైదరాబాద్: నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్‌ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఓ బాలికను లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బేగంపేటకు చెందిన రాజ్‌కుమార్‌(26)ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కాకాగుడాకు చెందిన ఓ బాలిక(17) ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

 A girl raped by her facebook friend

జూన్‌27న తన జన్మదినమని.. ఇంటికి రావాలని బాలికకు చెప్పాడు. దీంతో ఆ బాలిక అతని ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వచ్చిన ఆ యువతిపై అదే రోజు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మరుసటిరోజు కూడా ఆమెపై అఘాయిత్యాన్ని కొనసాగించాడు.

కాగా, రెండు రెండు రోజులు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బాలికను నిలదీశారు. దీంతో యువతి జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నింతుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పురపాలిక మాజీ ఛైర్మన్‌ భార్య ఆత్మహత్య

సూర్యాపేట: మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో మంగళవారం మధాహ్నం పురపాలిక మాజీ అధ్యక్షుడు మెరుగు రోశయ్య భార్య మెరుగు పద్మ(55) ఉరి వేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న మెరుగు పద్మ మంగళవారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చాలా సేపటి వరకు ఘటన వెలుగు చూడకపోగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+